• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో మళ్లీ ఉద్రిక్తతలు-సుప్రీంతీర్పుతో మరో ఉద్యమం-రఘురామ మద్దతు-వైసీపీ వ్యూహమిదే

|
Google Oneindia TeluguNews

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడి పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో మారిన పరిస్ధితులతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో అమరావతి విషయంలో వైసీపీ సర్కార్ కూడా వ్యూహం మారుస్తోంది. నిన్న మొన్నటి వరకూ సంయమనం పాటించిన ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝళిపిస్తోంది. అసలే మూడు రాజధానుల ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేని నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో తలెత్తుతున్న పరిస్ధితుల్ని అదుపు చేయడం వైసీపీ సర్కార్ కు కష్టసాధ్యంగా మారుతోంది.

 అమరావతి భూముల స్కాం

అమరావతి భూముల స్కాం

అమరావతిలో భారీ భూకుంభకోణం చోటు చేసుకుందంటూ గత కొన్నేళ్లుగా వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్ధలన్నింటినీ రంగంలోకి దించడం ద్వారా అమరావతిలో స్కాం జరిగిందిన్న ఆరోపణలు నిరూపించేందుకు ప్రభుత్వం చాలా శ్రమించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం అసలు ఈ వ్యవహారంలో వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ తేలిపోవడమే. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. టీడీపీ నేతలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని లబ్ధి పొందారంటూ వైసీపీ చేసిన ఆరోపణలు సుప్రీంకోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయి.

 తేలిపోయిన ఇన్ సైడర్

తేలిపోయిన ఇన్ సైడర్

అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా వేలాది ఎకరాల భూములు టీడీపీ నేతలు, అప్పటి మంత్రులు బలవంతంగా లాక్కున్నారని వైసీపీ ఆరోపణలు చేసేది. దీనికే ఇన్ సైడర్ ట్రేడింగ్ అని పేరు కూడా పెట్టింది. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించడం కష్టమని తెలిసినా ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైసీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని తోసిపుచ్చాయి. దీంతో వైసీపీ అమరావతిపై వేసిన అతి పెద్ద నింద పసలేనిదని తేలిపోయింది. దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఇప్పటికీ మాట్లాడలేని పరిస్ధితుల్లోకి వైసీపీ సర్కార్ జారిపోయింది.

 అసైన్డ్ భూముల్నే నమ్ముకున్న సర్కార్

అసైన్డ్ భూముల్నే నమ్ముకున్న సర్కార్

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సుప్రీంకోర్టే కొట్టేసిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తోంది. దీంతో గతంలో రాజధాని రాకముందే అసైన్డ్ భూములు అమ్ముకున్న వారితో పాటు వాటిని కొన్న టీడీపీ నేతల్ని టార్గెట్ చేయాలని సర్కార్ భావించింది. ఇందుకోసం సీఐడీని రంగంలోకి దింపింది. అయినా సీఐడీ కూడా దీన్ని నిరూపించేందుకు అష్టకష్టాలు పడుతోంది. ముఖ్యంగా అసైన్డ్ భూముల్ని అమ్ముకున్న వారి నుంచి సహకారం లభించకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ దర్యాప్తులో ముందుకెళ్లలేని పరిస్దితులున్నాయి. అసైన్డ్ భూముల్ని అమ్ముకోవచ్చంటూ జీవో ఇచ్చిన మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణను టార్గెట్ చేసినా హైకోర్టు అడ్డుకట్టతో దీనిపైనా పురోగతి లేకుండా పోతోంది.

 సుప్రీం తీర్పుతో పెరుగుతున్న స్వరాలు

సుప్రీం తీర్పుతో పెరుగుతున్న స్వరాలు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ,సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వం ఎంచుకున్న అసైన్డ్ భూముల వ్యవహారంలోనూ సరైన ఆధారాలు లభించకపోవడంతో అమరావతి గ్రామాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇక్కడి ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. మొదట్లో మూడు రాజధానులు ప్రకటించినప్పుడు అమరావతిపై ఆందోళనలు చేసేందుకు జంకిన వారు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్వరం పెంచుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పోలీసుల ఆంక్షల్ని సైతం ఛేదించుకుంటూ నిరసనలు చేపడుతున్నారు. దీంతో అమరావతి గ్రామాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతల ప్రమేయంతో అమరావతిలో రోడ్లు తవ్వేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా వారు మండిపడుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది.

 వైసీపీ సర్కార్ అణచివేత వ్యూహం

వైసీపీ సర్కార్ అణచివేత వ్యూహం

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమరావతి ఆందోళనలు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. తాజాగా అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసనలకు దిగిన వారిని బలవంతంగా అడ్డుకోవడం చూస్తుంటే అక్కడ మారిన పరిస్ధితులు ఇట్టే అర్జమవుతాయి. ఈసారి పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలివచ్చి నిరసనలు తెలపడం వైసీపీ సర్కార్ ను కలవరపెడుతోంది. మరికొంతకాలం ఈ ఉద్యమం సాగితే దీని ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపైనా పడుతుందని ప్రభుత్వం అంతర్మథనం పడుతోంది. దీంతో అమరావతిలో పోలీసుల సాయంతో అణచివేతకే ప్రాధాన్యమిస్తోంది.

Recommended Video

  Tokyo Olympics 2020 : Neeraj Chopra Fitness వెనుక ఇంత Hardwork ఉందా ? || Oneindia Telugu
   అమరావతికి రఘురామ సాయం

  అమరావతికి రఘురామ సాయం

  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓవైపు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తూనే మరోవైపు ప్రభుత్వం వ్యతిరేకించే అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో అమరావతి ఉద్యమకారులకు, జేఏసీ నేతలకు అపాయింట్మెంట్లు ఇప్పిస్తూ ఉద్యమానికి తనవంతు సాయం చేస్తున్నారు. బీజేపీ పెద్దలతో తనకున్న సంబంధాలను వాడుకుంటూ వీరికి అపాయింట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అమరావతిపై మందునుంచి సానుకూలంగా ఉన్న రఘురామరాజు.. వైసీపీ సర్కార్ వ్యూహాలకు తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమరావతికి తాను చేయగలిగినంత సాయం చేస్తానని హామీలు కూడా ఇస్తున్నారు. దీంతో అమరావతిలో వైసీపీ అణచివేతతో పాటు రాజధానికి జరుగుతున్న అన్యాయాన్ని సైతం బీజేపీ నేతల చెవిన వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతిని రాజకీయంగా సమర్ధిస్తామని చెబుతున్న బీజేపీకి, వైసీపీ వ్యూహాన్ని వివరించడం ద్వారా దూరం చేసేందుకు రఘురామ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అమరావతికి మద్దతు పలుకుతుండటం రఘురామకు కూడా కలిసివస్తోంది.

  English summary
  raising tones for amaravati capital once again after supreme court verdict on insider trading and ysrcp govt plans to supress the movement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X