రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు?
రాజమండ్రి లోక్‌సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ అభ్యర్థిగా తానే మరోసారి పోటీచేయబోతున్నట్లు మార్గాని భరత్‌రామ్ ప్రకటించారు. వేమగిరిలో పర్యటించిన భరత్‌రామ్ మీడియాతో మాట్లాడారు. వేమగిరి-సామర్లకోట రహదారి విస్తరణకు రూ.470 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటివరకు 5 ఫ్లై ఓవర్లకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈనెల 22వ తేదీన మోరంపూడి వద్ద ఫ్లై ఓవర్ కు భూమి పూజ జరగబోతున్నట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయా ఫ్రం వాల్ దెబ్బతినడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఎంపీ విమర్శించారు. ధవళేశ్వరం, కడియంలో రైతుబజార్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, రాజానగరం నుంచి పొట్టిలంక వరకు రూ.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఎంపీ అభ్యర్థుల్లో వైసీపీ కొందరిని మారుస్తోందంటూ ప్రచారం నడుస్తోంది. అయితే రాజమండ్రి నుంచి రాబోయే ఎన్నికల్లో తానే పోటీచేస్తున్నట్లు భరత్‌రామ్ ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో కూడా సీటు ఆయనకేనని స్పష్టమవుతోంది. అధిష్టానం ఆశీస్సులు తీసుకొనే ప్రకటించారా? లేదంటే తనకు తానే ప్రకటించుకున్నారా? అనే విషయమై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.
ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడమే తరువాయి.ఏదేమైనప్పటికీ వైసీపీ తరఫున రానున్న ఎన్నికలకు సంబంధించి ఒక అభ్యర్థి అధికారికంగా ఖారరయ్యారని భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications