రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం: తొక్కిసలాటలో ఒకరు మృతి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో వృద్ధుడు మృతి చెందాడు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేందుకు రాజమండ్రి వచ్చిన యాత్రికులు తిరుగు ప్రయాణంలో గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

వారితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా దువ్వకు చెందిన ఎం తాతారావు(55) ఆదివారం ఉదయం పుష్కర స్నానం చేయడానికి కుటుంబీకులతో రాజమండ్రి వచ్చారు. తిరిగి తమ గ్రామం వెళ్లేందుకు గోదావరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.

స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రైలు రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు గురైన తాతారావు ఊపిరాడక మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రైల్వే పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం


పుష్కర యాత్రికులకు రైల్వే ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆదివారం నిత్యం తిరిగే 130 రైళ్లు ఐదు గంటలు, 30 ప్రత్యేక రైళ్లు పది గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి.

 నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం


ఆదివారం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పది గంటలు ఆలస్యంగా నడిచింది. హౌరా, బెంగళూరు, అలెప్పీ, కేరళ మార్గాల్లో వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. క్రిక్కిరిసిపోతున్న రైళ్లలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

ప్రత్యేక రైళ్ల కారణంగా నిత్యం తిరిగే రైళ్లను సమయానికి నడపలేకపోతున్నామంటున్న అధికారులు చెప్పా పెట్టకుండా వాటిని రద్దు చేస్తున్నారు. శనివారం రాత్రి కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన రైలును రద్దు చేయడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు హతాశులయ్యారు.

 నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

ప్రయాణికులు రిజర్వేషన్ రద్దు చేయించుకుంటే పాతిక నుండి ముప్పాతిక శాతం కోత విధించే రైల్వేశాఖ చెప్పాపెట్టకుండా రైలు రద్దు చేసి ప్రయాణికులు ఇచ్చిన చార్జీ తిరిగి ఇచ్చేసింది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని శనివారం రద్దయిన రైలు ప్రయాణికులు కోర్టుకు వెళ్లాడానికి సిద్ధమవుతున్నారు.

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం


ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నారు. దాదాపు రైల్వే శాఖ నిర్వాకంపై ఇప్పటికే ప్రయాణికుల నుండి వెయ్యి ఫిర్యాదులు వెళ్లాయి. నగరంలో ఆధ్యాత్మి వాతావరణాన్ని శాంతి భద్రతల కింద నలిపేస్తున్న పోలీసులు రైల్వే స్టేషన్లను కూడా వదల్లేదు.

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కొత్తగా తూర్పు వైపున అదనంగా నాలుగు, ఐదు ఫ్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లాట్ ఫారాలపైకి ప్రయాణికులను అనుమతించడం లేదు.
 నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం


కేవలం బయటకు వెళ్లే వారికి మాత్రమేనని ఆంక్షలు విధించడంతో ఒకటి, రెండు, ఫ్లాట్‌ఫారాలకు వెళ్లాల్సిన వారంతా రైలు పట్టాలకు అడ్డం పడి వెళ్తున్నారు.

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం


రైలు దిగిన తరువాత ఎక్కడికి ఎలా వెళ్లాలో తగిన సమాచారం లేక కొంతమంది.. ఏ రైలు ఎప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్తుందో తెలియక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు.

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

నరక ప్రాయంగా పుష్కర ప్రయాణం

అనౌన్స్‌మెంటు కేవలం ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారానికి మాత్రమే వినిపించడంతో ప్రయాణికులంతా అక్కడే ఉండిపోతున్నారు. దీనితో గాలి కూడా చొరబడనంత రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు.

English summary
Rajahmundry railway station full busy for Godavari Pushkaralu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X