కడపలో చంద్రబాబుకు షాక్, జగన్ వైపు ఎమ్మెల్యే చూపు: రంగంలోకి టీడీపీ పెద్దలు
కడప: కడప జిల్లా తెలుగుదేశంలో కలకలం చోటు చేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ముఖ్య నేతలతో చర్చలు జరిగాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో చివరి నిమిషంలో టీడీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. మేడా అసంతృప్తికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆయనను బుజ్జగించారు. అయితే టీడీపీ పెద్దల జోక్యం, హామీతో ఆయన పార్టీ మారే ఆలోచన విరమించుకున్నారు. సోదరుడి ఒత్తిడి మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మేడా మల్లికార్జున రెడ్డి ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అంతా సద్దుమణిగడంతో మేడా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. మేడా వెనక్కి తగ్గడంతో టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.

మేడా వైసీపీలో చేరనున్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీలో ఉంటే టిక్కెట్ దక్కే అవకాశం లేదనే ఆందోళనతోనే ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది.
కడప జిల్లాలో వైయస్ ఫ్యామిలీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కారణంగానే 2014లో టీడీపీ నుంచి కేవలం మేడా మాత్రమే గెలిచారు. మిగతావి వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగు, బద్వేల్ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, జయరాములు టీడీపీలో చేరారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం ఏం చెప్పారంటే
కొందరు తనపై ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీని వీడటం లేదని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నంత మాత్రాన పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలిశానని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఎమ్మెల్యే మేడాకు పార్టీలో పూర్తి గౌరవం దక్కుతుందని తెలిపారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications