పొలిటికల్ ఎంట్రీ: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు?
ఏలూరు: తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి.
తన రాజకీయ ఎంట్రీ ఊహాగానాలపై ఆయన తాజాగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్త ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో ఆయన తన పొలిటకల్ ఎంట్రీ పుకార్లపై మాట్లాడారు.

రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో అందరినీ ఆనందింజేయడమే ఇష్టమని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు సత్కరించారు.
క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లగు చిత్రంగా స్కెవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్ కుమార్ చిత్రీకరించిన క్రీమిలేయర్ ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ చిత్రంంగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.. కల్యాణ్ రూపొందించిన బి ఆలర్ట్ ఎంపికయ్యాయి.
స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇడియా ఈజ్ డెడ్‌లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్ర ధరించిన సతష్ సుంకర దక్కించుకున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications