చంద్రబాబును కల్సి శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు
హైదరాబాద్: కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున చంద్రబాబును కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి వచ్చినందుకు చంద్రబాబుకు నాగార్జున అభినందనలు తెలిపారు. సినీ నటుడు రాజేంద్రప్రసాద్, పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కూడా చంద్రబాబును కలిసి.. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

చింతమనేనిపై ఎన్‌బిడబ్ల్యూ
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసు విషయంలో ప్రభాకర్ కోర్టుకు హాజరుకావడం లేదు. నోటీసులను పట్టించుకోలేదు. దీంతో ఆయనపై సీరియస్ అయిన భీమడోలు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
శ్రీవారిని దర్శించుకున్న డిగ్గీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శనివారం ఉదయం వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న డిగ్గీకి టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందచేశారు.












Click it and Unblock the Notifications