'లోకేష్‌ను చూస్తే జగన్ వణుకుతున్నారు, అదే సమర్థత, అందుకైనా మంత్రి పదవి'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబును సోమవారం నాడు కోరారు. లోకేష్‌ను చూస్తే జగన్ వణికిపోతున్నారన్నారు.
ఆయన సమర్థతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. వైసిపి నేత బొత్స సత్యనారాయణ పైన లిక్కర్ సిండికేట్ కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ సమావేశంలో జరిగిన ఫోటోను అడ్డు పెట్టుకొని వైసిపి అవాస్తవాలను ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.

అయితే తాము అసలు నిజాలు బయట పెట్టడంతో వైసిపికి దిమ్మ తిరిగిందన్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు అయినప్పటికీ పార్టీ నాయకులతో ఎలా నడుచుకోవాలో తెలుసునన్నారు. ఆయనకు సంస్కారం ఉందన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికైనా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
అసలు ప్రభుత్వ వ్యవహారాల్లో నారా లోకేష్ ఎప్పుడు జోక్యం చేసుకోలేదని, చేసుకోరాని కుండబద్దలు కొట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి శిఖండి పాత్ర పోషిస్తున్నారని రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications