వాచ్‌మన్ అనుమానాస్పద మృతి: లక్ష్మీపార్వతి ఇంటివద్ద ఆందోళన
హైదరాబాద్: రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఇంట్లో రాజు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అంశంపై మృతుడు కుటుంబ సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు.
రాజును డ్రైవర్ హత్య చేశాడని ఆరోపిస్తూ వారు లక్ష్మీపార్వతి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

కాగా, లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్‌మన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. లక్ష్మీపార్వతి నివాసంలో ఏడాది కాలంగా రాజు అనే వ్యక్తి వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అతను భార్య, కుమార్తెతో కలిసి లక్ష్మీపార్వతి ఇంటి వెనక కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు.
ఇదే ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న స్వామి, రాజుల మధ్య నెలరోజులుగా గొడవ జరుగుతోంది. గురువారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రాజు భార్య, కుమార్తె శుక్రవారం బయటకెళ్లి వచ్చేసరికి రాజు ఉరివేసుకొని కనిపించాడు.
రాజును స్వామియే ఉరివేసి చంపాడంటూ స్థానికులు ఆరోపించారు. పోలీసులు మృత దేహాన్ని తరలించే సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు స్వామిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోగల లక్ష్మీపార్వతి నివాసం ఉంది. ఆమె నివాసంలో పని చేస్తున్న రాజు కాకినాడకు చెందినవాడు.












Click it and Unblock the Notifications