ఏప్రిల్ నుంచి రామ్ చరణ్ తేజ్ విమానాలకు రెక్కలు
హైదరాబాద్: తెలుగు చిత్రాల హీరో రామ్ చరణ్ తేజకు చెందిన ఎయిర్‌లైన్స్ టర్బో మేఘా ఎయిర్‌వేస్ లిమిటెడ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఆయన సంస్థకు చెందిన విమానాలు గాలిలోకి ఎగురుతాయి. తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే విమానాలను నడపాలనే ఉద్దేశంతో ఆ సంస్థ ఉంది.
తొలుత 72 సీట్ల ఎటిఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ సంస్థ నడపనుంది. యాత్రికుల కోసం, ఆర్థికంగా దిగువ తరగతి చెందివారికి వాటిని అందుబాటులో తెస్తారు. తిరుపతి, విజయవాడ వంటి నగరాలకు ఈ విమానాలు తిరుగుతాయి. దానికితోడు దాని అనుబంధ సంస్థ టర్బో ఏవియేషన్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ను లక్ష్యం చేసుకుని 9 సీట్ల జెట్లను విజయవాడ నుంచి నడిపిస్తుంది.

పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ నుంచి అన్ని రకాల అనుమతులు వస్తే ఏప్రిల్ మొదటి వారంలో ఆపరేషన్స్ ప్రారంభిస్తామని టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థను 2013 మార్చి 14వ తేదీన స్థాపించారు. రామ్ చరణ్ తేజ, ఉమేష్ ఆ సంస్థ ప్రమోటర్లు. టర్బో ఏవియేషన్‌ను ఉమేష్, డి రాధారాణి ప్రారంభించారు.
రామ్ చరణ్ ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఏ విధమైన పాత్ర పోషిస్తారనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. అధికారికమైన సమావేశాలన్నింటిలో కంపెనీ డైరెక్టర్ పాల్గొంటున్నట్లు సమాచారం. అవసరమైనప్పుడు రామ్ చరణ్ వెళ్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications