చెప్తే విన్నారా? దేవుడికీ మండింది: జల్లికట్టుపై వర్మ మరోసారి

జల్లికట్టుపై మరోసారి స్పందించారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.

హైదరాబాద్‌: జల్లికట్టుపై మరోసారి స్పందించారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే జల్లికట్టుపై పలు విమర్శలు చేసిన ఆయన.. మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే.

ram gopal varma again fires at Jallikattu

ఈ ఘటనపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టు సంప్రదాయం అనాగరికమని, వినోదం కోసం మూగజీవులను హింసించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ ఘటనను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

'జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు, 129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతు దారులు ఏమంటారు? చెప్పండి.. మేమంతా వినాలి. ఈ ఘటన చూస్తే దేవుడు కూడా జల్లికట్టు మద్దతుదారులపై కోపం చూపుతూ.. ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ అనాగరిక క్రీడను ఇకనైనా ఆపుతారని ఆశిస్తున్నా' అని వర్మ తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు. ఇంత క్రూరమైన క్రీడను మద్దతు తెలుపుతున్న వారికి హృదయం ఉందా? అని వర్మ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+