ఎన్నికల ఫలితాల వేళ ఆ పార్టీకి హ్యాండిచ్చిన రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు.
వర్మతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి వారు రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన తరువాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై సెటైరికల్ మూవీస్ తీసి వారిపై తనకున్న కసిని తీర్చుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించిన మరుక్షణమే తాను కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నా అంటూ షాకిచ్చారు.

తాజాగా ఎన్నికల ఫలితాల సమయంలో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఎగ్జిట్ ఫలితాలపై తనదైనశైలిలో ఆయన రియాక్ట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ తాను కూడా ఓ ఎగ్జిట్ పోల్ చేశానంటూ దానికి సంబంబంచిన నెంబర్స్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు.
This has to be the MOST ACCURATE SURVEY 🙏🙏🙏 https://t.co/XllDH47M3X
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2024
ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ఎగ్జిట్ పోల్ రాము షేర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఎగ్జిట్ ఫలితాలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.ఇన్నాళ్లు వైసీపీకి సపోర్టు చేసిన రామ్ గోపాల్ వర్మ..ఫలితాల సమయంలో ఆ పార్టీ గెలుస్తుందని చెప్పకుండా ఇలాంటి పోస్ట్ షేర్ చేశారేంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications