మామూలుగా లేవు! ఎమ్మెల్యే అనితకు వర్మ కౌంటర్స్, వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్: సినిమాలతో కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకనే ఈ సినిమా తీస్తున్నారని, జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరని తేల్చి చెప్పారు.

కాగా, అనిత వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వర్మ స్పందించారు. అనిత అన్న వ్యాఖ్యాలకు తన వ్యంగ్యాస్త్రాలను జోడించి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టిగా సమాధానం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎమ్మెల్యే అనితకి కూడా అదేవిధంగా జవాబు ఇచ్చారు.

అదే నా అసలు ఉద్దేశం: వర్మ

అదే నా అసలు ఉద్దేశం: వర్మ

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
వర్మ జవాబు: అనిత గారు, బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం

బయోపిక్ కాదు..

బయోపిక్ కాదు..

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.

జవాబు: అనితగారు, ఈ సినిమా బయోపిక్ కాదు.. కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ.

విసిగెత్తిపోయాను..

విసిగెత్తిపోయాను..

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

జవాబు: అనితగారు, ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందు నుంచి విని విని విసుగెత్తిపోయాను

లోగుట్టు పేరుమాళ్లకెరుక

లోగుట్టు పేరుమాళ్లకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే.. వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

జవాబు: లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

అనితను ఎద్దేవా చేస్తూ..

అనితను ఎద్దేవా చేస్తూ..

టీడీపీ ఎమ్మెల్యే అనిత: చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు.. జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..

జవాబు: అనితగారు, మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు.
టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమాజహితం
జవాబు: ఆహా.. క్లాప్సు.. విజిల్స్ !!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+