సెన్సార్ బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడ్తా: రామ్‌గోపాల్ వర్మ

హైదరాబాద్: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై తాను క్రిమినల్ కేసు పెడుతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. కొన్ని చోట్ల తన సత్య - 2 సినిమా విడుదల కాకుండా ధనలక్ష్మి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ధనలక్ష్మిపై ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు వేస్తానని ఆయన శనివారంనాడు చెప్పారు.

సత్య - 2 సినిమా హిందీలో విడుదలైందని, తెలుగులో విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ధనలక్ష్మి నిర్ణయం వల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయారని ఆయన అన్నారు. సత్య-2కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ధనలక్ష్మి ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు.

Satya 2

సత్య - 2 సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. సమంత్ కుమార్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు సత్య -2లో శర్వానంద్, అనైక సోతి, అర్చన గుప్తాలు నటించారు. అమర్ మొహిలే, కారి అరోరా సంగీతం సమకూర్చారు.

సత్య - 2 తెలుగు వెర్షన్‌లో హైదరాబాద్ నేపథ్యాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అండర్ వరల్డ్ ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. క్రైమ్ రూపం మాత్రమే మార్చుకుంటుందనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+