జగన్ సినిమాకు టీడీపీ నేతల ఫ్రీ పబ్లిసిటీ- ఆర్జీవీ వ్యాఖ్యల కలకలం..!!

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్‌ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

Ram Gopal Varma thanked to TDP leaders Devineni Uma and Bonda Uma

ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తోంది చిత్రం యూనిట్. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కొన్ని సన్నివేశాలు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో తాను చూసిన వాస్తవ పరిస్థితులు, నమ్మిన నిజాల ఆధారంగా సినిమాను తీస్తోన్నానని, అవే ఈ సినిమాలో ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ సినిమా ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని వ్యాఖ్యానించారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన వ్యూహం సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వర రావు, బండారు సత్యనారాణ మూర్తి.. తన వ్యూహం సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తోన్నారని, వారికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు ఆర్జీవీ.

బండారు సత్యనారాయణ మూర్తి.. వ్యూహం సినిమా భారీ పోస్టర్‌ను పట్టుకుని నిల్చున్న ఓ మార్ఫింగ్ ఫొటోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ వారికి థ్యాంక్స్ చెబుతున్నానని, టీజర్ రిలీజ్ సమయంలో ఈ పబ్లిసిటీ ఉపయోగపడుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+