ఆర్జీవీ వ్యూహం అదే- లెక్క పక్కా: జగన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..!!
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రాజీనామా చేయడం, కడప లోక్‌సభ ఉప ఎన్నికలో రికార్డుస్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసుల వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వంటి అంశాలను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్నారు.
రెండో పార్ట్‌లో 2014 తరువాతి రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మహా ప్రస్థానం పాదయాత్రకు దారి తీసిన పరిణామాలను రెండో పార్ట్‌లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించనున్నారు.
2019 ఎన్నికల్లో జగన్ సాధించిన తిరుగులేని విజయాన్ని ఇందులో చూపించనున్నారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు, వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినక్స్ వంటి గ్రామీణ స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను రామ్ గోపాల్ వర్మ రెండో పార్ట్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండో పార్ట్ విడుదలవుతుందని చెబుతున్నారు.

ఈ సినిమా షూటింగ్.. విజయవాడలో శరవేగంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తోంది చిత్రం యూనిట్. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు.
2014లో ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మూడు రోజుల పాటు చేపట్టిన నిరాహార దీక్ష, దీక్షా శిబిరంలో ఆయనను వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిల పరామర్శించడం వంటి వర్కింగ్ స్టిల్స్ తాజాగా విడుదలయ్యాయి. అనుకున్నది అనుకున్నట్టే ఈ మూవీ తెరకెక్కుతోందంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications