బాబుపై రాష్ట్రపతి ప్రశంసలు...కోవింద్‌ను కొనియాడిన చంద్రబాబు...ఐఈఎ సదస్సు ముఖ్యాంశాలు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu
  100th Indian Economic Association summit : ఐఈఎ సదస్సు ముఖ్యాంశాలు

  అమరావతి: సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పొగడ్తలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేలా ఆర్థిక విధానాలు ఉండాలని, సామాజిక భద్రత ఉండేలా ప్రభుత్వ పాలసీలుండాలని కోవింద్ సూచించారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి ఉత్సావాలను రాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. పేదరికం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి కోవింద్‌ అని చంద్రబాబు కొనియాడారు.

  Ram Nath Kovind inaugurate the 100th Indian Economic Association (IEA) summit today held at Acharya Nagarjuna University

  ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ జ్యోతీ ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్ర, జన్‌ధన్ యోజన వంటి స్కీముల ద్వారా సామాజిక భద్రత లభిస్తుందని ఆశిస్తున్నానని, మానవ సమాజం కీలకమైన మార్పు దిశలో ఉందన్నారు. ఐఈఏ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని, వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య ఉండే అసమానతలు రాత్రికి రాత్రే తొలగిపోవని, న్యూ ఇండియా కల సాకారం అవ్వాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత విధాన నిర్ణయాల్లో ఎంతో మంది నిపుణుల కృషి ఉందని, సదస్సులు దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేశాయని

  ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తు చేశారు. అనేక శాస్త్రాలను అర్థశాస్త్రం తనలో ఇముడ్చుకుందని, అర్థశాస్త్రం ఓ నదీ ప్రవాహం లాంటిదన్నారు. ఆలోచనలు వినూత్నంగా ఉండాలని, మహమ్మద్‌ యునీస్‌ ఆలోచన ఉపఖండంలో మార్పు తెచ్చిందని రామ్‌నాథ్ కోవింద్‌ చెప్పారు.

  Ram Nath Kovind inaugurate the 100th Indian Economic Association (IEA) summit today held at Acharya Nagarjuna University

  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం చంద్రబాబు కొనియాడారు. పేదరికం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి కోవింద్‌ అని అభివర్ణించారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి ఉత్సావాలను రాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.

  భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందని, 2020 నాటికి దేశంలో మూడో స్థానంలో ఏపీని నిలుపుతామని బాబు స్పష్టం చేశారు. 2017 సంవత్సరంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బీజం పడిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఈ ఏడాదిలోనే జరిగాయని, భవిష్యత్తులో భారతదేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు చెప్పారు.

  ఎన్నో కష్టాలున్నా రాష్ట్రంలో రెండంకెల వృద్ది సాధిస్తున్నామన్నారు. ఏపీ తలసరి ఆదాయం ఇంకా పెరిగేలా ఈ సదస్సు ద్వారా సూచనలు చేయాల్సిందిగా ఆర్థిక నిపుణులను కోరుతున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  amaravathi: President Ram Nath Kovind inaugurateద the 100th Indian Economic Association (IEA) summit today held at Acharya Nagarjuna University (ANU) at Namburu in Guntur district

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి