వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌రిటాల సునీత‌, శ్రీ‌రామ్‌ను అడ్డుకున్న పోలీసులు... బీకే.. అడుగు ముందుకేస్తే కాల్చిపారేస్తా: సీఐ హెచ్చ‌రిక‌

|
Google Oneindia TeluguNews

శ్రీ స‌త్య‌సాయి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థ‌సార‌థిపై రామ‌గిరి సీఐ చిన్న గౌస్ జూలు విదిల్చారు. అడుగు ముందుకేస్తే కాల్చిపారేస్తానంటూ హెచ్చ‌రించారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై వైసీపీ నాయ‌కుల దాడిని నిర‌సిస్తూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌ గేటు వద్ద పార్టీ నాయ‌కులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ త‌మ స్వ‌గ్రామం వెంక‌టాపురం నుంచి వ‌స్తుండ‌గా రామ‌గిరి వ‌ద్ద పోలీసులు అడ్డ‌గించారు.

ఎమ్మెల్యే కార్యక్రమం ఉంది.. నిరసన వద్దు

ఎమ్మెల్యే కార్యక్రమం ఉంది.. నిరసన వద్దు

స్థానిక ఎమ్మెల్యే ప్ర‌కాష్ రెడ్డి కార్య‌క్ర‌మం ఉండ‌టంతో నిర‌స‌న చేప‌ట్ట‌వ‌ద్ద‌ని పోలీసులు సూచించారు. దీంతో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు పార్థ‌సార‌థి అక్క‌డికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. శాంతి భ‌ద‌త్ర‌ల‌కు భంగం వాటిల్ల‌కూడ‌ద‌నే వారిని అడ్డ‌గించామ‌ని రామ‌గిరి సీఐ చెప్పారు. ''పోలీసులు త‌మ విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తే కుప్పంలో చంద్ర‌బాబునాయుడు రోడ్డుపై బైఠాయించాల్సిన అవ‌స‌రం వ‌చ్చేది కాద‌ని'' పార్థ‌సార‌థి అన్నారు. దీనిపై సీఐ చిన్న‌గౌస్ ఆగ్ర‌హించి ''అస‌లు ఇక్క‌డ‌కు రావ‌డానికి నువ్వెవ‌రంటూ'' ప్ర‌శ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు, సీఐకి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

అడుగు ముందుకేస్తే కాలుస్తా

అడుగు ముందుకేస్తే కాలుస్తా


బీకేను ఉద్దేశించి ''అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తా''నంటూ సీఐ చిన్న గౌస్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీఐ వెంట‌నే క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ రమాకాంత్‌కు సీఐ కాలుస్తాన‌న్నారంటూ ప‌రిటాల సునీత ఫిర్యాదు చేశారు. అనంత‌రం నేతలంతా ఎన్ఎస్ గేటుకు వెళ్లి నిర‌స‌న‌లో కూర్చున్నారు.

ఎమ్మెల్యే సోదరుడి హైడ్రామా

ఎమ్మెల్యే సోదరుడి హైడ్రామా


వైసీపీకి చెందిన చెన్నేకొత్తపల్లి ఉపసర్పంచి రాజారెడ్డి తన మద్దతుదారులైన 50 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వెంక‌టాపురం బ‌య‌లుదేరారు. ఆయ‌న‌తోపాటు టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ దుర్గప్ప, అమరేంద్ర ఉన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తుపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి సోద‌రుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి వారిని అడ్డుకొని బలవంతంగా రాజారెడ్డిని లాక్కెళ్లారు.

తమపై దాడి చేసి రాజారెడ్డిని గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టారని టీడీపీ నేత‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ''తాను తోట వద్దకు వెళ్తుంటే.. తెదేపా నేతలు కిడ్నాప్‌ చేశారంటూ'' ఉపసర్పంచి రాజారెడ్డి వీడియోను వైసీపీ నాయకులు విడుదల చేశారు. రాజారెడ్డిని బెదిరించి ఆ వీడియోను రికార్డు చేయించినట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ దౌర్జన్యాలను సహించేది లేదని పరిటాల సునీత హెచ్చరించారు. టీడీపీలో చేరడానికి వస్తున్న రాజారెడ్డిని రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బలవంతంగా తీసుకెళ్లారని, ఆయన హైడ్రామా ఆడారని ఆరోపించారు.

English summary
Sri Satyasai Telugu Desam Party district president BK Parthasarathy was hurled by the CI of Ramagiri.He warned that if he steps forward, he will be shot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X