ఎన్ కౌంటర్ సమయంలో మావో అగ్రనేత రామకృష్ణ అక్కడ లేరు :ఎస్ పి
మల్కనగిరి :సోమవారం తెల్లవారుజామున ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కడ లేడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆర్ కె తప్పించుకొన్నారనే వార్తలను మల్కనగిరి , విశాఖ ఎస్ పిలు మిత్రబాను మహాపాత్రో,రాముల్ దేవ్ శర్మలు తెలిపారు.
కూంబింగ్ కు వెళ్ళిన పోలీసులకు మావోలు ఎదురుపడ్డారని లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా తమపై కాల్పులు ప్రారంభించారని , ప్రతిగా తాము కూడ కాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటన జరిగిన సమయంలో మావో అగ్రనేత రామకృష్ణ అక్కడ లేరని చెప్పారు. ఆయన తనయుడు మున్నా అక్కడే ఉన్నారని చెప్పారు.

ఈ ఎన్ కౌంటర్ లో కొందరు మావోలు గాయపడి తప్పించుకొన్నారని, ఒక్కరు కూడ తమకు లొంగిపోలేదన్నారు.ఈ ఎన్ కౌంటర్ బూటకం ఎణ్ కౌంటర్ కాదని వారు చెప్పారు.
ఎపి హైకోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను 72 గంటలపాటు భద్రపరుస్తామన్నారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు ఇప్పటివరకు తమను ఫోన్ లో సంప్రదించారన్నారు. మృతదేహాన్ని తీసుకెళ్ళనున్నట్టు చెప్పారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications