చంద్రబాబు పై పెరుగుతున్న ఒత్తిడి - బిగ్ టాస్క్..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై వ్యతిరేకత పెరుగుతోంది. కార్మికులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా ప్లాంట్ లో తీసుకుంటున్న నిర్ణయాలు.. తగ్గుతున్న ఉత్పత్తితో ఆందోళన పెరుగుతోంది. ఎన్డీఏ పార్టీలను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతలు సైతం ప్రయివేటీకరణ చేస్తే రాజీనామా చేస్తామని హామీ చేస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో వామపక్షాలు చంద్రబాబు పైనే భారం వేస్తూ ఒత్తిడి చేస్తున్నారు.
ప్రయివేటీకరణ - ఆందోళన
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టి. అమ్మేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌లో రెండు ప్లాంట్లను మూసివేశారని, మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని రామకృష్ణ తెలిపారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారు చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని అన్నారు.

తాజా నిర్ణయాలతో
వైజాగ్ స్టీల్‌కు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. కాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రూ.9 వేల కోట్ల పెట్టుబడికి 58 వేల కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నేస్ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని, 75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నుంచి 30 లక్షల టన్నులకు స్టీల్ ఉత్పత్తి పడిపో నుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

చంద్రబాబు పై ఒత్తిడి
దీంతో అనివార్యంగా నష్టాల్లోకి విశాఖ ఉక్కును నెట్టాలని బీజేపీ మోదీ ప్రభుత్వం భావిస్తోందని, రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ను డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలన్నారు. విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. దీంతో, ఇప్పుడు సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications