"ముంత మట్టి, చెంబు నీళ్లతో అమరావతి ఏర్పడుతుందా? "

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబుకు ఓ లేఖ రాశారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, ఆశలను తుంగలో తొక్కిన బిజెపి విదానాలపై సమాధానం కోరుతున్నట్లు ఆయన లేఖలో చెప్పారు. అమలుకు నోచుకోని ప్రకటనలతో బిజెపి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

ముంత మట్టి, చెంబు నీళ్లు

ముంత మట్టి, చెంబు నీళ్లు

ముంత మట్టి, చెంబు నీళ్లతో రాజధాని ఏర్పడుతుందా అని రామకృష్ణ హరిబాబుకు రాసిన లేఖలో ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గంగాజలం, మట్టి తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే.

  ఆస్తుల సంపాదనే బాబు లక్ష్యం
  మల్లీ పాత పాటే పాడుతున్నారు..

  మల్లీ పాత పాటే పాడుతున్నారు..

  రాష్ట్ర ప్రజలకు బిజెపి నేతలు పాత పాటే వినిపిస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీని ఎంతో ఘనంగా ప్రకటించారని అంటూ ఏ మేరకు అమలు జరిగిందని ప్రశ్నించారు. పదేల్ల ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని విమర్శించారు.

  ఎన్నికల ఎత్తుగడలో భాగంగా...

  ఎన్నికల ఎత్తుగడలో భాగంగా...

  2019 ఎన్నికల ఎత్తుగడలో భాగంగా బిజెపి పావులు కదుపుతోందని రామకృష్ణ విమర్శించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆ విషయం అర్తమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన మోసానికి బాధ్యత వహిస్తూ రాష్ట్రం నుంచి గెలిచి ఇద్దరు బిజెపి ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు రారజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  నేను కట్టుబడి ఉన్నా..

  నేను కట్టుబడి ఉన్నా..

  రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయం గురించి తాను ఢిల్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, ఎంపి హరిబాబు స్పష్టం చేసారు గణాంకాలతో సహా నిరూపించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

  కేవలం రాజకీయ లబ్ధి కోసమే...

  కేవలం రాజకీయ లబ్ధి కోసమే...

  కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, వామపక్షాలు బంద్ చేయడం విచారకరమని హరిబాబు అన్నారు. మచిలీపట్నం వచ్చిన కేంద్ర మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలియజేయాలని ప్రయత్నించిన వైసిపి నాయకుడు, పేర్ని వెంకట్రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CPI Andhra Pradesh secretary Ramakrishna has written letter to BJP MP Kabhampati Haribabu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి