వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాధనంతో సొంత ప్రచారమా?:చంద్రబాబుపై రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే మండిపాటు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ప్రచారం చేసుకుంటున్నారని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్‌ పాండే విమర్శించారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండే ఏపీకి చెందిన సామాజికవేత్త బి.రామకృష్ణంరాజుతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత,పార్టీ ఇమేజ్‌ పెంచుకోవడానికి చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పబ్లిసిటీ కోసం అత్యధికంగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు.

ప్రకటనలపై...మార్గదర్శకాలు తుంగలోకి

ప్రకటనలపై...మార్గదర్శకాలు తుంగలోకి

ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు హోర్డింగ్‌లతో సహా అన్ని రకాల యాడ్స్ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మార్గదర్శకాలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని సందీప్‌ పాండే ధ్వజమెత్తారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి తన విగ్రహాలు తయారు చేయించుకుని ప్రధాన కూడళ్లలో పెట్టుకోవడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం మాయవతికి మించి సొంత పార్టీ ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మరింత భారీగా ప్రచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని ఆయన దుయ్యబట్టారు.

ప్రధాని...తన పేరు పెట్టుకోవడం లేదు

ప్రధాని...తన పేరు పెట్టుకోవడం లేదు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రధానమంత్రి అనే పదాన్ని వాడుతున్నారే తప్ప మోడీ అని తన పేరు పథకం ముందు చేర్చడం లేదని...కానీ ఎపిలో మాత్రం ఎన్టీఆర్, చంద్రన్న పేర్లతో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో అడ్వర్ టైజ్ మెంట్లు, హోర్డింగ్‌లు, ఇతర రకాల ప్రచారాన్ని ప్రజాధనంతో చేసుకుంటూ పార్టీకి ఇమేజ్‌ వచ్చేలా వ్యవహరిస్తున్న తీరు తప్పక మారాల్సి ఉందన్నారు. టిడిపి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఏడాదిలోనైనా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ఇమేజ్‌ పెంచుకునే తరహా ప్రకటనలు, పబ్లిసిటీ మానుకోవాలని హితవు పలికారు.

 ఇవీ పథకాల పేర్లు...ఇలా పెట్టండి

ఇవీ పథకాల పేర్లు...ఇలా పెట్టండి

ఏపీలో ఏకంగా 30 పథకాలకు వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ పెరిగేలా స్వార్థంతో చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సందీప్‌పాండే చెప్పారు. అన్న, చంద్రన్న, ఎన్టీఆర్‌ పేర్లతో పథకాలు, ప్రకటనలు ఇవ్వడం సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో పెన్షన్‌ పథకం, సుజల స్రవంతి, జలసిరి, విద్యోన్నతి, వైద్యసేవ, వైద్య పరీక్ష, ఆశయం, విదేశీ విద్యాదారణ, ఎన్టీఆర్‌ గృహనిర్మాణం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. చంద్రన్న పేరుతో చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న విదేశీ విద్యాదీవెన, విద్యోన్నతి, స్వయం ఉపాధి, సంచార చికిత్స, ఉన్నత విద్యదీపం, తోఫా, క్రిస్మస్‌ కానుక, సంక్రాంతి కానుక, రైతునేస్తం, చంద్రన్న పెళ్లికానుక వంటి పేర్లతో సొంత ఇమేజ్‌ పెంచుకుని పార్టీకి మేలు జరిగేలా ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని వారు తప్పుబట్టారు. ఇప్పటికైనా ఈ పథకాలకు ముందున్న ఎన్టీఆర్, అన్న, చంద్రన్న పేర్లు మార్పుచేసి ‘ముఖ్యమంత్రి' పేరు పెట్టుకోవడం మంచిదని, అలా అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ఏళ్లు అయినా ఈ పథకాలు అదే పేరుతో కొనసాగుతాయని సందీప్‌పాండే సూచించారు.

ప్రకటనలపై...సుప్రీం కోర్టు మార్గదర్శకాలు...

ప్రకటనలపై...సుప్రీం కోర్టు మార్గదర్శకాలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల జారీపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు ఇచ్చిందని సందీప్‌పాండే వివరించారు. 13/2003, 302/2012 సివిల్‌ రిట్‌ పిటిషన్లపై 2015 మే 13, ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన సందీప్ పాండే వెల్లడించారు. ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఫొటోలు వాడుకోవచ్చు. అయితే ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు వాడని పక్షంలో వారికి బదులు ఆయా ప్రభుత్వ శాఖల మంత్రుల ఫొటోలు వాడుకోవచ్చు.
అయితే ప్రజా ప్రయోజనం లేని ప్రకటనలకు ప్రజాధనాన్ని వెచ్చించకూడదు. ఒక వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ, ప్రభుత్వానికిగానీ ప్రచారం కల్పించే విధంగా ఈ ప్రకటనలు ఉండరాదు.

సుప్రీం కోర్టు...మరికొన్ని మార్గదర్శకాలు...

సుప్రీం కోర్టు...మరికొన్ని మార్గదర్శకాలు...

పౌరులకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజెప్పే విధంగా, ప్రభుత్వ విధానాలు, సేవలు, ప్రభుత్వ చొరవతో తీసుకునే కార్యక్రమాలు, ప్రజారోగ్యం, పరిసరాలు, భద్రత మొదలైన విషయాలపై ప్రకటనలు ఉండాలి. రాజకీయ పార్టీల చిహ్నాలు,గుర్తులు, జెండాలు ప్రభుత్వ ప్రకటనల్లో ప్రదర్శించకూడదు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకమైనా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతాయి కాబట్టి పథకాలకు అధికార పార్టీ నాయకుల, వ్యక్తుల పేర్లను పెట్టి కొనసాగించడం సమంజసం కాదు. ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీలోని అధికార పార్టీ నేతల ప్రచారానికి ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు ఎన్నికల్లో వారి గెలుపుకోసం ఉపయోగించుకునే విధంగా ఉంటున్నాయని సందీప్‌పాండే విమర్శించారు.

English summary
Prominent social worker and Raman Magsaysay award winner Sandeep Pandey criticized that Chief Minister Chandrababu Naidu has been spending crores of rupees for advertising and campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X