తల్లిదండ్రులు కాబోతున్న ఉపాసన, రామ్ చరణ్
మెగా అభిమానులకు కథానాయకుడు చిరంజీవి శుభవార్త వినిపించారు. సినీ నటుడు, తన తనయుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. 'హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉపాసన, రామ్‌చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకుంది. భారతీయుడు2 కూడా పట్టాలెక్కడంతో ఇప్పటికే పూర్తవ్వాల్సిన సినిమా వాయిదా పడింది. షూటింగ్ స్లోగా నడుస్తోంది. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నారు. కబడ్డీ నేపథ్యంతో గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఉపాసన అపోలోలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ తాను చేయబోయే చిత్రాలన్నీ పాన్ ఇండియా సబ్జెక్టులనే ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతున్న పుష్ప2 చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ చిరంజీవి ఒక శుభవార్తను వినిపించడంద్వారా మెగా అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications