జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి ఎమ్మెల్యే రాజేశ్వరి, డైరెక్షన్ జ్యోతులదే!

Subscribe to Oneindia Telugu
  జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ టీడీపీలోకి నెక్స్ట్ ఏంటి జగన్ ? | Oneindia Telugu

  విజయవాడ: ప్రజా సంకల్ప యాత్రకు సిద్దమవుతున్న తరుణంలో జగన్‌కు గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.

  టార్గెట్-50: జగన్ మాస్టర్ ప్లాన్.. లిస్ట్, రూట్ మ్యాప్ సిద్దం, టీడీపీ కంచుకోటలకు ఎర్త్?

  సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరేందుకు ఇప్పటికే అంతా సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న జగన్.. రాజేశ్వరి బాటలోనే ఇంకా ఎవరైనా వెళ్తున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

   టీడీపీ ఆకర్ష్

  టీడీపీ ఆకర్ష్

  ఇప్పటికే దాదాపు 20మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే నంద్యాల ఉపఎన్నికల తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. అంతర్గతంగా ఆ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు చంద్రబాబు.

   వైసీపీని చావుదెబ్బ కొట్టడానికే

  వైసీపీని చావుదెబ్బ కొట్టడానికే

  ఎన్నికలు సమీపించే నాటికి ఈ వలసల పర్వాన్ని మరింత జోరందుకునేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అటు జగన్ కూడా.. ఎక్కడా వలసలకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో వైసీపీ నేతల అభద్రతా భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని వైసీపీని మరింత చావు దెబ్బ తీయాలని టీడీపీ భావిస్తోంది.

   జ్యోతుల డైరెక్షన్ లోనే

  జ్యోతుల డైరెక్షన్ లోనే

  తన రాజకీయ గురువు జ్యోతుల నెహ్రూ సూచన మేరకే ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉండటం వల్ల నియోజకవర్గంలో పనులు జరగడం లేదని, అధికార పార్టీకి మారితే తప్ప అది సాధ్యం కాదని రాజేశ్వరి భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాన్ని పట్టి పీడుస్తున్న తాగునీటి సమస్య కోసం లోకేష్ తో మాట్లాడి హామి కూడా పొందినట్టు చెబుతున్నారు.

  గెలుస్తామో లేదో అన్న అనుమానంతో:

  గెలుస్తామో లేదో అన్న అనుమానంతో:

  ఈ మేరకు రక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు లోకేష్ హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా జగన్ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాజేశ్వరి వాపోయినట్టు తెలుస్తోంది. వైసీపీలోనే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కూడా కష్టమవుతుందన్న ఉద్దేశంతోనే పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It's a big shock to YSRCP President Jagan Mohan Reddy, Another MLA From party joins TDP

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి