పెళ్ళినాటి వాగ్ధానం మేరకు, ఓ భర్త భార్య కోసం ఇలా చేశాడు

పెళ్ళి నాటి ప్రమాణాలను ఆచరించాడు ఓ భర్త. చావుబతుకుల మధ్య ఉన్న తన భార్యకు తన కిడ్నీని దానం చేసి భార్యను బతికించుకొన్నాడు ఓ భర్త. విశాఖ జిల్లాలో తన భార్యకు మరో జన్మనిచ్చిన భర్త ను పలువురు ప్రశంసిస్తున్న

విశాఖపట్టణం:పెళ్ళి నాటి ప్రమాణాలను ఆచరించాడు ఓ భర్త. చావుబతుకుల మధ్య ఉన్న తన భార్యకు తన కిడ్నీని దానం చేసి భార్యను బతికించుకొన్నాడు ఓ భర్త. విశాఖ జిల్లాలో తన భార్యకు మరో జన్మనిచ్చిన భర్త ను పలువురు ప్రశంసిస్తున్నారు.

విశాఖ పట్టణంలోని పురుషోత్తపురానికి చెందిన ఆదిరెడ్డి రాము నాయుడు అనకాపల్లి, జివిఎంసి జోనల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 1989 లో మాలతీదేవితో వివాహమైంది.

ramunaidu gives his kidney for his wife

వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి ఇటీవలే వివాహం చేశారు.రామనాయుడి భార్య మాలతీదేవి కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ వచ్చింది.

వైద్యులకు చూపిస్తే ఆమె కిడ్నిలను మార్చాలని చెప్పారు వైద్యులు. అయితే తన కిడ్నీ ఇచ్చేందుకు రామునాయుడు ముందుకు వచ్చాడుఅయితే భార్య అంగీకరించలేదు.

వివాహ సమయంలో ధర్మేచ..అర్థేచ..కామేచ...మోక్షేచ...నాతి చరామి అంటూ చేసిన ప్రమాణానికి కట్టుబడి ఆయన తన భార్య మాలతీదేవికి కిడ్నీ ఇచ్చాడు.

రామానాయుడు ఇచ్చిన కిడ్నీని మాలతీదేవికి వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు.వారం రోజుల క్రితమే రామునాయుడు విధుల్లో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+