తండ్రి మరణం: బాధను దిగమింగి బరిలోకి దిగిన ఆంధ్రా క్రికెటర్, రాణించాడు

అనంతపురం/పాటియాలా: ఓ వైపు కన్నతండ్రి మరణించిన బాధను దిగమింగుకొని... ఆంధ్రా జట్టు తరఫున పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా క్రికెటర్ ప్రశాంత్ కుమార్ అదరగొట్టాడు. తండ్రి అంత్యక్రియలు ముగియగానే జట్టుకు తన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో పాటియాలకు వెళ్లాడు.

తండ్రి మరణిస్తే ఎవరైనా తమ పనులన్నీ పక్కనపెట్టేసి అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాల్లో ఉంటారు. ప్రశాంత్ కుమార్మాత్రం తండ్రి అంత్యక్రియలకు వెళ్లి, ఒక్కరోజులోనే క్రికెట్‌ కోసం తిరిగి వెళ్లాడు. ప్రశాంత్ ఆంధ్ర యువ రంజీ క్రికెటర్. అనంతపురంకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు.

ఆంధ్ర జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. రంజీ మ్యాచ్‌ కోసం పంజాబ్‌లోని పటియాలాలో ఉండగా మ్యాచ్‌కు ముందు ప్రశాంత్‌కు తండ్రి మరణ వార్త తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. తిరగి పటియాలాకు వచ్చేశాడు. ఐతే పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా 80 పరుగులకే కుప్పకూలింది.

Ranji trophy 2015: Gurkeerat shines as Punjab beat Andhra by 7 wkts on Day 2

బాధను దిగమింగి అంకితభావంతో ఆడిన ప్రశాంత్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడమే కాక ఒక కీలక రనౌట్‌ చేసి ఆ జట్టు 147 పరుగులకే ఆలౌట్‌ కావడంతో కీలకపాత్ర పోషించాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రశాంత్‌ 29 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి కచ్చితంగా పంజాబ్‌తో ఆడదామనే నిర్ణయించుకున్నానని, బంధువులు వద్దని చెప్పినా వినలేదని, తండ్రి మరణం చాలా బాధగా ఉందని, అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని ప్రశాంత్‌ చెప్పాడు.

ఇదిలా ఉండగా... పంజాబ్‌తో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర 7 వికెట్ల తేడాతో ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర. రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో పంజాబ్‌ ముందు కేవలం 67 పరుగుల లక్ష్యం నిలవగా.. ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+