వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కు మరోసారి షాక్: జగన్ సర్కారుపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్ిపై తీవ్ర విమర్శలతో ప్రభుత్వ విధానాలను తప్పుబడుతుంటే.. మరో వైపు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం అవకాశం వచ్చిప్పుడల్లా వైసీపీ సర్కారుపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా, మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారాయన.

దేశానికే ఆదర్శమంటూ..

దేశానికే ఆదర్శమంటూ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదరంగా నిలుస్తోందంటూ రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. అలాంటి ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. సోమవారం రాజోలు పంచాయతీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాపక పాల్గొని ప్రసంగించారు.

అభినందించాల్సిందేనంటూ..

అభినందించాల్సిందేనంటూ..

ఆరోగ్యశ్రీ పథకం 1059 వ్యాధులకు వర్తిస్తుందని, ఏప్రిల్ నాటికి 2059 వ్యాదులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే రాపాక తెలిపారు. రూ. వెయ్యి ఖర్చు మించిన ప్రతి వ్యాధిని ఈ పథకం కింద వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అంతేగాక, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును జారీ చేయడం అభినందించాల్సిన విషయమని అన్నారు.

గతంలోనూ జగన్ సర్కారుపై ప్రశంసలు..

గతంలోనూ జగన్ సర్కారుపై ప్రశంసలు..

జగన్ సర్కారు విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ మాత్రం తరచూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ సర్కారు చేస్తున్న పలు పథకాలను ప్రశంసిస్తూ ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింేద.

జనసేనాని అలా.. ఎమ్మెల్యే ఇలా..

జనసేనాని అలా.. ఎమ్మెల్యే ఇలా..

వైఎస్సార్ వాహనమిత్ర పథకం ప్రారంభం సందర్భంగా వైఎస్ జగన్ చిత్ర పటానికి రాపాక పాలాభిషేకం చేశారు. అంతేగాక, మూడు రాజధానుల సీఎం జగన్ నిర్ణయాన్ని రాపాక స్వాగతించారు. మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై ఇప్పటికే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి జనసేనకు తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాపాక పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ సదరు ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. సర్కారు చేసే మంచి పనిని అభినందించడం తప్పేం కాదని ఆయన భావనలా తెలుస్తోంది.

English summary
Janasena MLA Rapaka Varaprasad once again praises CM YS Jagan's Government policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X