నోటికి లుంగీ చుట్టి వదినపై అత్యాచారయత్నం, హత్య

Rape attempt on Sister in law
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తన వదినపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పెద్దశంకరంపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన సుజాత, రమేష్ దంపతులు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం పెద్దశంకరంపేటకు వచ్చారు.

వీరికి రమేష్ పెదనాన్న తనయుడు కూడా తోడయ్యాడు. మంగళవారం భర్త రమేష్ నారాయణఖేడ్ వెళ్లాడు. ఆ రోజు రాత్రి మద్యం సేవించి వచ్చిన చందర్ వదిన సుజాత పైన అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కరీంనగర్‌లో...

కరీంనగర్‌లో బుధవారం సాయంత్రం ఒక విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాదితురాలు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్‌కు చెందిన విద్యార్థిని కరీంనగర్‌లోని మానేరు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళిన విద్యార్థిని బుధవారమే పాఠశాలకు తన బాబాయితో కరీంనగర్‌కు చేరుకుంది. అయితే పాఠశాలకు వెళ్ళి ఫీజు చెల్లించిన తరువాత విద్యార్థినితో పాటు సంతోష్ భోజనం చేయడానికి ఒక ఆటోలో కరీంనగర్ బస్‌స్టాండ్‌కు వచ్చారు.

భోజనం అనంతరం ఒక ఆటోలో విద్యార్థినిని పాఠశాలలో దించాలని చెప్పిన బాబాయి వెళ్ళిపోయాడు. ఆటో డ్రైవర్ పద్మనగర్‌లోని మానేరు పాఠశాలకు వెళ్ళకుండా మంకమ్మతోట నుంచి విద్యానగర్ ద్వారా నగర శివారులోని రేకుర్తి చెట్లపొదల్లోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆటోను నిలిపి బాలికపై అత్యాచారయత్నం చేయగా వెంటనే పెద్దగా అరచి, అతన్ని నెట్టివేయడంతో వదిలి పెట్టాడు. స్థానిక సర్పంచ్ భర్త ప్రకాశ్ ఆమెను గుర్తించి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాధితురాలి వద్ద వివరాలు సేకరించి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+