రాసలీలల ఎమ్మెల్యే ఆదిమూలంపై రేప్ కేసు-మెడికల్ టెస్టులకు బాధితురాలు నో..!
ఏపీలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన రేప్, లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తపై రేప్, లైంగిక వేధింపులకు దిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు మరో షాకిచ్చారు. అటు బాధితురాలు మాత్రం పోలీసులకు షాకిచ్చింది.
ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఆదిమూలానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించానని, చంద్రబాబు నిర్ణయం మేరకు ఒప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేసానని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత తనను హోటల్ కు పిలిపించి ఆయన రేప్ చేశారని, ఆ తర్వాత కూడా మళ్లీ రమ్మని వేధిస్తుంటే రెండుసార్లు వెళ్లానని, మూడోసారి తన భర్త ఇచ్చిన పెన్ కెమెరాతో మొత్తం వ్యవహారం రికార్డు చేశానని పేర్కొంది. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు ఆదిమూలంపై రేప్ కేసు పెట్టారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా బాధితులు మాత్రం పోలీసులకు షాకిచ్చింది. ఆదిమూలం తనను రేప్ చేశారంటూ ఆరోపించిన బాధితురాలు.. మెడికల్ టెస్టుల కోసం తిరుపతి ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ పరీక్షలకు నిరాకరించింది. రేప్ జరిగినట్లు నిర్ధారించేందుకు పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు కోరగా... తాను సిద్దంగా లేనని, మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయింది. దీంతో పోలీసులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి.సాక్షాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు చెప్పినా బాధితురాలు పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అసలు రేప్ జరిగిందా లేదా అన్న చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications