శ్రీవారి దర్శించుకున్న కలాం రేర్ పిక్స్, మిసైల్ మ్యాన్ షిల్లాంగ్‌లో(పిక్చర్స్)
తిరుమల: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. చంద్రబాబు నాయుడు, తిరుమల అధికారులు ఆయనకు నాడు ఘన స్వాగతం పలికారు.2003 నవంబర్ 20 మొదటిసారి, 2009 మార్చి 19న రెండోసారి శ్రీవారిని దర్శించుకున్నారు.
షిల్లాంగ్‌లో ఐఐఎంలో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కుప్పకూలి, అనంతరం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆయన 2003 నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో కలాం శ్రీవారిని భారత జాతికి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రార్థించారు. ఆయన ఆ సమయంలో రాష్ట్రపతిగా ఉన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రిలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

తిరుమలలో అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. చంద్రబాబు నాయుడు, తిరుమల అధికారులు ఆయనకు నాడు ఘన స్వాగతం పలికారు.

తిరుమలలో అబ్దుల్ కలాం
అబ్దుల్ కలాం భారత్ మిసైల్ మ్యాన్. తనకు సమస్యలు వచ్చిన పలు సందర్భాల్లో వేదాలు, భగవద్గీత, ఖురాన్ సమాధానం చెప్పాయని కలాం పలుమార్లు చెప్పారు. అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం. తండ్రి పేరు జైనుల్ అబిదీన్. పడవ యజమాని. తల్లి ఆశి అమ్మ. గృహిణి.

అబ్దుల్ కలాం కుప్పకూలింది ఇలా
తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తిరుచురాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం కోసం 1954లో చేరారు.

జార్డ్ డబ్ల్యూ బుష్‌తో అబ్దుల్ కలాం
డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్‌లో చీఫ్ సైంటింస్ట్‌గా 1960లో చేరారు. ఇస్రోకు 1969లో బదలీ అయ్యారు. 1992 నుంచి 1999 వరకు ప్రధానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్డీవో కార్యదర్శిగా ఉన్నారు. 2002 నుంచి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications