జగన్ పార్టీపై మంత్రి కిషోర్, రాష్ట్రం విడిపోయినా...

కడప: మధ్యలో పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయని కడప జిల్లా ఇంచార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కేకలు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

వారికి అధికారం అందడం కల అన్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్ల విడుదల చేసినట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్, రుణాలు అందజేస్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.

Ravela Kishore lashes out at Congress and YSRCP

ప్రతిపక్ష పార్టీలు అధికార దాహంతో పసలేని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేకపోయినా రాష్టవ్య్రాప్తంగా 40 లక్షల మందికి సామాజిక పెన్షన్ల నిమిత్తం రూ.5 వేల కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోయినా తెలుగుప్రజలు మాత్రం విడిపోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+