వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమ డిక్లరేషన్: ఆ డిమాండ్‌కు టిడిపి సపోర్ట్, పార్టీలకు ఇబ్బందేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Rayalaseema Declaration : BJP Hits Out At Ally TDP

అమరావతి: రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని బిజెపి రాయలసీమ డిక్లరేషన్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలకు కారణంగా మారుతోంది.ఈ డిమాండ్‌ను కొందరు టిడిపి నేతలు కూడ సమర్ధిస్తున్నారు. కర్నూల్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలనే డిమాండ్‌ను టిడిపి నేతలు బహిరంగంగానే సమర్ధిస్తున్నారు. మరోవైపు ఈ డిక్లరేషన్ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ను తెరమీదికి తీసుకొచ్చింది.ఏపీ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని అన్ని పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా బిజెపి మోసం చేసిందని ఆ పార్టీ మిత్రపక్షం టిడిపి కూడ విమర్శలు చేస్తున్న తరుణంలో బిజెపి తెచ్చిన రాయలసీమ డిక్లరేషన్ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణంగా మారింది

అయితే బిజెపి డిక్లరేషన్‌లో చేర్చిన కొన్ని అంశాలు స్థానికంగా సెంటిమెంట్‌ను రగిల్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో బిజెపి నేతల డిమాండ్లు రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

రాయలసీమలో రెండో రాజధాని

రాయలసీమలో రెండో రాజధాని

కర్నూల్‌ను ఏపీ రాష్ట్రానికి రెండో రాజధానిని చేయాలనే డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు, గవర్నర్ తాత్కాలిక విడిది, సీఎం నివాసం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను కొందరు టిడిపి నేతలు కూడ తమ అంతర్గత సంభాషణల్లో సమర్ధిస్తున్నారు.మరికొందరు నేతలు బహిరంగంగానే ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

అందుకే బిజెపి రాయలసీమ డిక్లరేషన్, నేను రాయలసీమ బిడ్డనే: బాబుఅందుకే బిజెపి రాయలసీమ డిక్లరేషన్, నేను రాయలసీమ బిడ్డనే: బాబు

కర్నూల్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలి

కర్నూల్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలి

కర్నూల్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలనే డిమాండ్ పట్ల టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడ సానుకూలంగా స్పందించారు. దినకర్‌తో పాటుగా బీజేపీ డిమాండ్‌ను టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. 15 ఏళ్లుగా కర్నూలును రెండో రాజధాని చేయాలని వాదిస్తున్నానని అన్నారు. సీమలో రెండో రాజధానికోసం మద్దతు తెలిపేవారందరినీ టీజీ స్వాగతించారు.

పలుమార్లు రాయలసీమ అంశంపై చర్చ

పలుమార్లు రాయలసీమ అంశంపై చర్చ

రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని గతంలో పలుమార్లు ఆందోళనలు, యాత్రలు, ఉద్యమాలు కూడ చోటు చేసుకొన్న పరిస్థితులు కూడ ఉన్నాయి. అయితే తాజాగా బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ను తెరమీదికి తెచ్చింది. అయితే ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాజకీయాల్లో మార్పులకు నాంది పలికే అవకాశం ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు. రాజకీయపార్టీలు కూడ ఈ డిమాండ్లపై చర్చలను తెరమీదికి తెచ్చే అవకాశం ఉంది.

ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోతోంది, బిజెపితో టిడిపి కటీఫ్: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోతోంది, బిజెపితో టిడిపి కటీఫ్: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

ఎన్నికల్లో ప్రభావం చూపేనా

ఎన్నికల్లో ప్రభావం చూపేనా

రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బిజెపి తెరమీదికి తీసుకొచ్చిన అంశాలు రానున్న ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపుతాయనే విషయమై ఇప్పటికిప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల సమయం నాటికి రాయలసీమకు అన్యాయం జరిగిందని ప్రజలు ఆందోళన బాట పడితే ఆ సమయంలో రాజకీయ పార్టీలు ఈ విషయమై నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

English summary
Tdp official spokesperson Dinakaran supported to Kurnool town second capital of India.Bjp Rayalaseema declaration announced on Friday at Kurnool. it effects on political parties said analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X