వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను నమ్ముకొని కాదు: రాయపాటి, బిజెపికి కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెసు పార్టీ విభజనపై ముందుకు వెళ్తుందనే ఆరోపణలు అర్థరహితమని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం అన్నారు.

ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాము ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకొని తీరుతామని చెప్పారు. పార్టీ అధిష్టానం విభజన పైన ముందుకే వెళ్తే కనుక తాము ఏం చేయాలనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక ఆ బిజెపికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. బిజెపి సీమాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశముందన్నారు. బిజెపి విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదని భావిస్తున్నామని, తెలంగాణ బిల్లుపై తీర్మానం అడ్డుకుంటామన్నారు.

సమస్యలు పరిష్కరించకుండా ముందుకు సాగదు: డొక్కా

సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించకుండా విభజనపై ముందుకు సాగడం ఏమాత్రం సరికాదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వేరుగా అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజనపై ముందుకు వెళ్లాలన్నారు.

లగడపాటి ఇంటి ముట్టడి

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇంటిని వైయస్సార కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao on Monday condemned allegations against Congress Party High Command on YSRCP issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X