విశాఖ రైల్వే జోన్‌కు సాంకేతిక సమస్యల అడ్డంకి: రాయపాటి
విశాఖ రైల్వే జోన్ హామికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నప్పటికీ.. సాంకేతిక సమస్యలు ఇందుకు అడ్డు వస్తున్నాయని అన్నారు.
విశాపట్టణం: కొన్ని సాంకేతిక కారణాల వల్ల విశాపట్టణంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం లేదని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ హామికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నప్పటికీ.. సాంకేతిక సమస్యలు ఇందుకు అడ్డు వస్తున్నాయని అన్నారు.

రైల్వే జోన్ ఏర్పాటుపై రాయపాటి బుధవారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. విశాఖకు సాంకేతిక కారణాలు అడ్డంకిగా ఉన్నందువల్ల.. వేరే ప్రాంతాల్లో రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జోనల్ కార్యాలయం ఏర్పాటుకు గుంటూరు అనుకూలంగా ఉంటుందని ఈ సందర్బంగా రాయపాటి అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 30న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కు శంకుస్థాపన చేయనున్నట్లు రాయపాటి తెలిపారు. ఇక పెద్ద నోట్ల రద్దుపై స్పందిస్తూ.. ఆ నిర్ణయం దురదృష్టకరమని, చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని రాయపాటి అన్నారు.












Click it and Unblock the Notifications