పార్టీలో లేను: రాయపాటి, డోకా లేదు: సాయి ప్రతాప్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు పాత మిత్రుడని,1982లో చంద్రబాబు సహకారంతోనే రాజ్యసభ సభ్యునిగా గెలుపొందానని ఆయన చెప్పారు. ఇటీవల ఢిల్లీలో దీక్షలో ఉన్న చంద్రబాబు నాయుడిని రాయపాటి పరామర్శించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని రాయలసీమకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, లగడపాటి మాదిరిగా కోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. తమ రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం పడిపోదని తెలిపారు. పార్టీని వీడేవారు సమైక్యవాద పార్టీల వైపు మొగ్గు చూపుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications