రాజధానిపై రాయపాటి సంచలనం, జేడీ శీలం కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ వేశారు. వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఉన్న వారు కొందరు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేశారని రాయపాటి ఆరోపించారు.
కొందరి సూచన మేరకే వినుకొండను రాజధాని అన్నారని ఆరోపించారు. దొనకొండలో కమిటీ సభ్యులు భూములు కొన్నారని ఆరోపించారు. కమిటీని కొందరు నాయకులు ప్రభావితం చేశారన్నారు. రాయపాటి వ్యాఖ్యల పైన జేడీ శీలం స్పందించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరిలో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుతున్నారన్నారు. కమిటీ నివేదికతో టీడీపీ నేతలు కంగుతిన్నారన్నారు.
మరోవైపు, రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత వ్యవహారం కాదని, కేంద్రమే రాజధానిని విషయాన్ని నిర్ణయించాలని పలువురు అంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడికి కమిటీ లొంగిపోయి నివేదిక ఇచ్చిందన్నారు. వీజీటీఎం రాజధాని ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకమంటున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications