రాజధానికి రైతులు భూములివ్వాలి: రాయపాటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతులందా భూములు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కోరారు. రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ పరిహారం వచ్చేలా తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడుతానని ఆయన శనివారంనాడు మీడియా సమావేశంలో రైతులకు హామీ ఇచ్చారు. రైతులు సీఆర్‌డీఏకి సహకరించాలని ఎంపీ రాయపాటి కోరారు.
నాగార్జునసాగర్ కుడి కాలువకు కనీసం 15 టిఎంసిల నీటిని విడుదల చేయాలని, లేకుంటే రబీ ఆయకట్టు ఎండిపోతుందని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ జల వివాదంపై కృష్ణా ట్రిబ్యునల్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కృష్ణా జలాల సమస్యపై రివర్ బోర్డు ప్రేక్షక పాత్ర వహిస్తోందని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఇరురాష్ర్టాల మధ్య జలాల విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. బోర్డు ఆదేశాలను ఇరు రాష్ర్టాలను పాటించాలని ఎంపీ రాయపాటి సూచించారు.
నాగార్జునసాగర్ వద్ద శుక్రవారంనాడు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. దీంతో వివాదంపై ఇరు రాష్ట్రాల నాయకులు ప్రతిస్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications