బ్యాంకు చెక్కులు ఇస్తున్నారా, RBI బిగ్ అలర్ట్ - ఇక నుంచి..!!

బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. చెక్కులు వినియోగించే కస్టమర్ల కోసం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏదైనా చెక్కు క్లియర్ కావాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతోంది. దీని వల్ల కస్టమర్లకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతోంది. అందుకే ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై చెక్​ క్లియరెన్స్ ఒక్కరోజులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బ్యాంకుల నుంచి కస్టమర్లకు సమాచారం అందుతోంది.

బ్యాంకు కస్టమర్ల కోసం ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి చెక్కు క్లియరెన్స్ ఒక్క రోజులోనే (సేమ్ డే) పూర్తి కానుంది. అది కూడా నిర్దేశించి విధంగా గంటల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆర్​బీఐ సూచించిన ఈ సెటిల్మెంట్​ ఫ్రేమ్​వర్క్ అక్టోబర్​ 4 నుంచే అమల్లోకి రానుంది. బ్యాంకింగ్ సర్వీసుల్లో వచ్చిన మార్పులతో ప్రస్తుతం నగదు లావాదేవీలు వేగంగా కొనసాగుతున్నాయి.

RBI Announces that same-day cheque clearance from October 4 as first phase

బ్యాంకుల యాప్ ల ద్వారా కస్టమర్లు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చెక్కుల విషయంలో మాత్రం కనీసం రెండు రోజుల సమయం తీసుకుంటున్నారు. ఇది కస్టమర్లు ఇబ్బంది గా మారుతోంది. దీంతో.. ఆర్బీఐ తాజా ఆదేశాల మేరకు ఇకపై చెక్​ క్లియరెన్స్ ఒక్కరోజులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అంగీకరించడంతో అక్టోబర్​ 4 నుంచి అమలు కానుంది.

ఈ తాజా విధానం అమలు కోసం ఆర్​బీఐ కంటిన్యూస్​ క్లియరింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్​ చెక్కు సమర్పించిన గంటల వ్యవధిలోనే అది క్లియర్ అవుతుంది. ఈ విధానంలో బిజినెస్​ టైమ్​లో చెక్కుల స్కానింగ్​, సమర్పణ, క్లియరింగ్ మొదలైనవి నిరంతరాయంగా కొనసాగుతాయి. నూతన విధానం ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు సమర్పించవచ్చు.

ఆ చెక్కులు సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ అవుతాయి. అంటే మీరు చెక్కు సమర్పించిన రోజే.. కస్టమర్ ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా కొత్త విధానం అమలు కానుంది. ఈ కొత్త వ్యవస్థ రెండు దశల్లో అందుబాటులోకి రానుంది. ఫేజ్​-1లో సాయంత్రం 7 గంటల్లోపు చెక్​లను క్లియర్ చేయాల్సి ఉండగా, ఫేజ్​-2లో చెక్కు సమర్పించిన 3 గంటల్లోపు దానిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 3 నుంచి రెండో ఫేజ్​ ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+