• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇల్లు, కారుతో పాటు సెంటు భూమి లేని వెంకయ్య: ఆస్తుల్ని వెల్లడించిన పీఎంఓ

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ ఎక్సేంజీల్లో తమ డబ్బుని పెట్టుబడిగా పెట్టారు. మరికొంత మంది నగలు, ఫాంహౌస్‌లు, ప్టాట్లను, బ్యాంకు ఖాతాలను ఎక్కువగా కలిగి ఉండగా, ఇంకొంత మందికి సొంత వాహనాలు కూడా లేవు.

అయితే కేంద్ర మంత్రులందరూ తమ వద్ద డబ్బు తక్కువగా ఉన్నట్లు చూపించారు. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర మంత్రులు పలువురు వెల్లడించిన ఆస్తులను ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తన వెబ్ సైట్‌లో ప్రకటించింది.

సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు వంటి కొంతమంది నేతలకు వారి పేరిట సొంత వాహనం కూడా లేదు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు 4 ఇళ్లు, 7 స్థలాలు, కారు, టెలిఫోన్, మొబైల్, కంప్యూటర్, గన్, రివాల్వర్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు.

రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ముంబైలో ప్లాట్, మహారాష్ట్రలో వ్యవసాయ భూమి, గోవాలో వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు. సీనియర్ మంత్రులైన రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్, మేనకా గాంధీ, హర్షవర్ధన్‌లు ఇంకా తమ ఆస్తుల్ని ప్రకటించలేదు.

వెంకయ్య నాయుడు:

రూ.28 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్య పేరిట కొన్ని ఆస్తులు ఉన్నాయి. సెంటు భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు, కారు లేవు. ఇల్లు, వ్యాపార సంపద కూడా లేవు. షేర్లు, బాండ్స్‌, డిబెంచర్‌లలో కూడా ఎలాంటి పెట్టుబడులు లేవు.

సుష్మా స్వరాజ్‌:

ఒక్క కారు కూడా లేదు. భర్త పేరిట మాత్రం మెర్సిడెస్‌ కారు, వోక్స్‌వ్యాగన్‌ కారు ఉన్నాయి. ఢిల్లీలో ఒక రెసిడెస్సియల్‌ ప్లాట్‌, పల్వల్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన భూమి, రూ.23 లక్షల చరాస్థులు, నగలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

అశోక్‌ గజపతిరాజు:

షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. టాటా స్టీల్‌, ఆగ్రో టెక్‌ ఫుడ్స్‌, అశోక్‌ లైలాండ్‌, బాలాజీ టెలీఫిల్మ్స్‌, కైర్న్‌ ఇండియా, భారత ఎలక్ర్టానిక్స్‌, ధనలక్ష్మి బ్యాంక్‌, ఎక్సైడ్‌, హావెల్స్‌, హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఎన్‌డీటీవీ, ఎన్‌హెచ్‌పీసీ ఎన్‌టీపీసీ, సన్‌టీవీ, టీవీఎస్‌ మోటార్స్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీ‌ఎఫ్‌సీ లిమిటెడ్‌, ఐడియా సెల్యులర్‌, టీవీ టుడే, యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఎస్‌ బ్యాంక్‌లలో షేర్లు ఉన్నాయి. ఒక జీప్‌, టాటా నానో కారు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ఇళ్ల వివరాలనూ ఆయన పేర్కొన్నారు.

స్మృతి ఇరానీ:

ముంబైలో రూ.90 లక్షల రెసిడెన్షియల్‌ ప్లాట్‌, గోవాలో రూ.87.50 లక్షల రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎన్‌ఎస్‌సి సర్టిఫికెట్లు, అన్‌లి‌స్టెడ్‌ కంపెనీలలో కొన్ని షేర్లు ఉన్నాయి.

రాధామోహన్‌ సింగ్‌:

బిహార్‌, నోయిడాలలో రూ.62 లక్షల ఆస్తులున్నాయి. బిహార్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఆస్తుల జాబితాలో రివాల్వర్‌, రైఫిల్‌, వాచ్‌, రెండు మొబైల్‌ ఫోన్‌లున్నాయి. ఎఫ్‌డీలో కొంత మొత్తం పెట్టారు. ఒక కారు కూడా లేదు.

థావర్‌చంద్‌ గెహ్లాట్‌:

రూ.39 లక్షల రెండు ఇళ్లు, 1.60 కోట్ల పెట్రోల్‌ బంకు, 2 మోటార్‌సైకిళ్లు, ట్యాంకర్‌ లారీ, 2 కార్లు ఉన్నాయి. ఆభరణాలు, మొబైల్‌, ఐప్యాడ్‌, బ్యాంకులో ఎఫ్‌డీలు, రివాల్వర్‌, గన్‌ ఉన్నట్లు చూపారు.

రవిశంకర్‌ ప్రసాద్‌:

25 ఆర్ధిక సంస్థల్లో షేర్లు ఉన్నాయి.

Real estate tops Union cabinet ministers’ asset chart, few invest in stocks

ఉమాభారతి:

నాలుగు ఇళ్లు ఉన్నాయి. వీటిలో రెండు పూర్వీకుల నుంచి వచ్చినవి కాగా మరో రెండు స్వార్జితం. ఇంట్లో దేవుడికి కొంత బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పాలసీ ఉన్నాయి. సొంత కారు లేదు.

సురేష్‌ప్రభు:

ముంబయిలో ఒక ఫ్లాట్‌ ఉంది. మహారాష్ట్రలో వ్యవసాయ భూమి, గోవాలో వ్యవసాయేతర భూమి, మ్యూచువల్‌ఫండ్లు, బాండ్లు, షేర్లలో పెట్టుబడులున్నాయి.

జేపీనడ్డా:

పొదుపు ఖాతా, స్థిర ధరావతులు, బీమా పాలసీల వివరాలు వెల్లడించారు. రెండు కార్లు, ఆభరణాలు, నివాస, భూమి వంటి ఆస్తులున్నాయి.

రాంవిలాస్‌ పాశ్వాన్‌: బిహార్‌లో ఒక ఫ్లాట్‌, వ్యవసాయ భూమి ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఆభరణాలు, ఒక సంస్థలో యాజమాన్యం, పెట్రోలు బంక్‌ల్ని ఆస్తులుగా ప్రకటించారు.

సదానంద గౌడ:

6ఇళ్లు, 7స్థలాలు, కారు, టెలిఫోన్‌, మొబైల్‌, కంప్యూటర్‌, తుపాకీ, రివాల్వర్‌ఉన్నాయి. ఆభరణాలు, బాండ్లు, డిబెంచర్లలోపెట్టుబడులున్నాయి.

జితేంద్రసింగ్‌:

జమ్మూలో రూ.1.97 కోట్ల విలువ చేసే ఇల్లు. రూ.33 లక్షల విలువైన వ్యవసాయ భూమి.

బీరేందర్‌సింగ్‌:

హర్యానాలో 3, ఢిల్లీలో గృహం ఉన్నాయి. హర్యానాలో వ్యవసాయ భూమి, వాణిజ్య భవనం, రెండు కార్లు, ఎఫ్‌డీలు తదితరాలున్నాయి.

నరేంద్రసింగ్‌ తోమర్‌:

ఇళ్లు, ఆభరణాలు, ఎఫ్‌డీలు, బీమా పాలసీలున్నాయి.

హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌:

బ్యాంకులు, షేర్లలో పెట్టుబడులు, షేర్ల కోసం ఖాతా ఉంది.

మహేశ్‌శర్మ:

రూ.19.19 కోట్ల విలువ చేసే ఐదు గృహాలు. ఒకటి వారసత్వంగా వచ్చింది. కంపెనీ షేర్లలో పెట్టుబడులు, రెండు కార్లున్నాయి.

English summary
Real estate tops Union cabinet ministers’ asset chart, few invest in stocks Suresh Prabhu, Sadananda Gowda, Ashok Gajapathi Raju and Ravi Shankar Prasad are among the few ministers to have invested in financial instruments such as bonds and stocks, while real estate seems to be the preferred asset-building avenue for most of the members of the Union cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more