అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీంలో అమరావతి అసలు కథ మొదలైందా ? కీలకంగా అసెంబ్లీపై కేంద్రం వాదన-ఎన్నికల తీర్పు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో అమరావతి రాజధానికి మద్దతుగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు, హైకోర్టు తీర్పు యథాతథంగా అమలు చేయాలంటూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు.. తాజాగా 264 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో రైతులు, వ్యక్తులు, సంస్ధలు, అధికారులు, రాజకీయ పార్టీలున్నాయి. అయితే వీరందరు వినిపించే వాదనల కంటే కేంద్రం ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. అదే సమయంలో అమరావతిపై సుప్రీంలో మొదలైన కథ ఏపీ రాజకీయాల్ని ఏ మలుపులు తిప్పబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.

సుప్రీంలో అమరావతి అసలు కథ మొదలు

సుప్రీంలో అమరావతి అసలు కథ మొదలు

అమరావతి రాజధానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో అసలు విచారణ మొదలైంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే హైకోర్టు అమరావతే రాజధాని అంటూ ఇచ్చిన కీలక తీర్పు సరైనదా కాదా, దీన్ని అమలు చేయాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. గతంలో హైకోర్టులోనే దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ విచారణ ఓ కొలిక్కి వచ్చి తీర్పు వెలువడింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది ఎంతకాలం సాగబోతోందన్నది చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే వచ్చే ఏడాదిలో ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఇక్కడి రాజకీయ పార్టీలకు ఇది చాలా కీలకం.

 సుప్రీం చూపు దానిపైనే

సుప్రీం చూపు దానిపైనే

ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఏపీ రాజధానిని రెండు లేదా మూడు ముక్కలు చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీకి అధికారం ఉందా లేదా అన్న దానిపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టిసారించబోతోంది. ఎందుకంటే హైకోర్టు ఈ అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ అసెంబ్లీ లేని అధికారాన్ని వాడి అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి ఆమోదించిందనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీంతో ఇప్పుడు అసెంబ్లీకి ఆ అధికారం ఉందా లేదా అన్నది కీలకంగా మారింది. అయితే గతంలో అసెంబ్లీకి రాజధానుల్ని మార్చే అధికారం కోరుతూ రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టి బిల్లుతో ఈ అధికారం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేనట్లేనని నిర్ధారణ అయింది. హైకోర్టు కూడా అదే చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెబితే ఇక ఈ పిటిషన్లేవీ చెల్లకుండా పోవడం ఖాయం.

 కేంద్రం వాదనే అత్యంత కీలకం

కేంద్రం వాదనే అత్యంత కీలకం


రాష్ట్ర అసెంబ్లీకి రాజధానిని ముక్కలు చేసే అధికారం ఉందా లేదా అన్న అంశంపై వాదనలు వినిపించేందుకు వీలుగా సుప్రీంకోర్టు 264 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకూ, జాతీయ రాజకీయ పార్టీల నుంచి ప్రాంతీయ రాజకీయ పార్టీల వరకూ, సీఎం జగన్ నుంచి కిందిస్ధాయి అధికారుల వరకూ ఉన్నారు. అలాగే అమరావతి రైతులు ఎలాగో ఉన్నారు. వీరంతా వినిపించే వాదనలు అమరావతి రాజధాని వ్యవహారాన్ని నిర్ధారించబోతున్నాయి. వీరిలో కేంద్రం వినిపించే వాదన చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే గతంలో అమరావతిలో ఉన్న రాజధానిని మార్చే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఉందని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇప్పుడు అసెంబ్లీకి ఉందా లేదా అన్నది కేంద్రం స్పష్టం చేయాల్సి ఉంది.
దీంతో ఇప్పటికే అమరావతి మద్దతుగా రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఏం చెప్పబోతోందన్నది చాలా కీలకంగా ఉంది.

 ఎన్నికల తీర్పు కాబోతోందా ?

ఎన్నికల తీర్పు కాబోతోందా ?


అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు కచ్చితంగా ఏపీ ఎన్నికల్ని ప్రభావం చేయబోతోంది. ఎందుకంటే అమరావతికి మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు వృథా కావడమే కాకుండా జనంలోనూ అధికార పార్టీ ప్రతిష్ట మనకబారడం ఖాయం. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానుల ఏర్పాటు అధికారం ఉందని సుప్రీంకోర్టు తేలిస్తే అది కచ్చితంగా టీడీపీతో పాటు ఇతర విపక్షాలన్నింటికీ గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. మూడు రాజధానుల్ని అడ్డుకున్న విపక్షాలపై జనాగ్రహం కచ్చితంగా కనిపించడం ఖాయం. ఈ ప్రభావం కచ్చితంగా 2024 ఎన్నికల ఫలితాలను నిర్దేశించినా ఆశ్చర్యం లేదు. దీంతో సుప్రీంకోర్టు కొత్త ఏడాదిలో ఇచ్చే అమరావతి తీర్పు కీలకంగా మారిపోతోంది.

English summary
supreme court has taken up actual issue of amaravati capital and issued notices to 264 respondents on ysrcp govt's plea challenging high court verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X