Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రియల్‌మీ కొత్త ఫోన్‌.. ₹9వేలకే ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం, 50 కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లతో నార్జో N53 ఫోన్‌ను విడుదల చేసింది. నార్జో ఎన్‌ సిరీస్‌లో ఈ కంపెనీ తీసుకొచ్చిన రెండో ఫోన్‌ ఇది. తక్కువ ధరలో 4జీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవారిని ఇది ఆకట్టుకుంటోంది.

నార్జో ఎన్‌53 ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతోంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా నిర్ణయించారు. మే 24వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటల నుంచి దీని విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. HDFC బ్యాంక్‌ కార్డు హోల్డర్లు ₹1000 వరకు రాయితీ పొందొచ్చు. మొదటి విడత అమ్మకాల్లో 4జీబీ వేరియంట్‌ను రూ.500, 6జీబీ వేరియంట్‌ను రూ.1000 రాయితీపై అందిస్తున్నారు. మే 22వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల మధ్య ₹1000వరకు డిస్కౌంట్‌తో స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తున్నారు.

realme

ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్ల విషయానికొస్తే 6.74 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్‌ రేటుతో ఉంది. అక్టాకోర్‌ యునిసోక్‌ T612 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13తో రియల్‌మీ యూఐ 4.0తో వస్తోంది. వెనుకవైపు 50 బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో అమర్చిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం అరగంట వ్యవధితో 0-50 శాతం ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ ప్రకటించింది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉండి బ్లాక్‌, గోల్డ్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభిస్తుంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+