ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా వెనుక ..జగన్ మాస్టర్ మైండ్
సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత , సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో జగన్ మొదటి నుంచి కూడా క్లారిటీగానే ఉన్నారు.
సర్వేల్లో ముందున్నవారికే టికెట్లు కేటాయిస్తాని.. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన.తాజాగా దీనికి అనుగుణంగా జగన్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేసి సంచలనం సృష్టించారు.

వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారంటే .. అభ్యర్థుల వడపోత ఎంతటి స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు, వైసీపీకి సైతం రాజీనామా చేయడంతో.. తొలుత అందరూ షాక్‌కు గురైయ్యారు.అయితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి బరి నుంచి తప్పుకోవడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఆళ్లకు సంబంధించి అన్ని విషయాలు జగన్‌కు తెలిసే జరిగియానే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జగన్ సూచనతోనే ఆళ్ల పదవికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 2014లో మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల .. 2019 ఎన్నికల్లో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు.

2019 ఎన్నికల తరువాత మంగళగిరి నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది.అమరావతి నుంచి రాజధాని తరలిపోవడంతో.. అక్కడి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
పలు సర్వేల్లో ఇదే విషయం వెల్లడైందట. పైగా ఈసారి ఆళ్లకు టికెట్ ఇస్తే..రెడ్డి సామాజిక వర్గమే ఆయన్ను ఓడించడానికి సిద్ధపడిందని విశ్వసనీయ సమచారం.దీనిని ముందే గ్రహించిన జగన్.. సైలెంట్‌గా ఆళ్లను పక్కకు తప్పించారనే టాక్ అధికార పార్టీలో వినిపిస్తుంది.

ఇదే సమయంలో చేనేత వర్గానికి చెందిన వారు మంగళగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటంతో...ఆ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలను జగన్ అప్పగించారు. ఈ నిర్ణయంతో రెడ్డి సామాజిక వర్గాన్ని శాంతపరచడంతో పాటు, చేనేత వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించి..వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఆళ్లను సైలెంట్‌గా తప్పించడంలో జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications