వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ రఘురామ ఇంట వేడుక : కేంద్ర మంత్రులు -టీడీపీ, టీఆర్ఎస్ నేతలతో కలిసి..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఇంట వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు సందడి చేసారు. రఘురామ షష్ఠి పూర్తి వేడుకలు ఢిల్లీలో నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వైసీపీ మినహా దాదాపు అన్ని పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, శోభా కరంద్లాజే , మాజీ మంత్రి హర్ష వర్దన్ పలువురు బీజేపీ..కాంగ్రెస్.. టీఎంసీ..డీఎంకే..శివసేన పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

టీ కాంగ్రెస్ - టీఆర్ఎస్ నేతలు

టీ కాంగ్రెస్ - టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా.. టీఆర్ఎస్ లోక్ సభ - రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. నామా నాగేశ్వరరావు.. బండి పార్ధసారధి రెడ్డి, నామా నాగేశ్వర రావు ఉన్నారు. టీడీపీ ఎంపీల్లో కేశినేని నాని మినహా..గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర వచ్చేశారు. వైసీపీతో విభేదాలు ప్రారంభం అయిన తరువాత సాయిరెడ్డి ఢిల్లీ కేంద్రంగా బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది.

చంద్రబాబు - పవన్ మద్దతు

చంద్రబాబు - పవన్ మద్దతు

అయితే, ప్రధాని ఏపీ పర్యటన సమయంలో రఘురామ సొంత నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం రఘురామకు పాల్గొనే అవకాశం ఉన్నా..ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో..రఘరామ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరి..ఆగిపోయారు. ఇక, తాజాగా...టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రఘురామకు మద్దతుగా పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. ప్రధాని పర్యటనలో రఘురామ పాల్గొనే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటూ చంద్రబాబు ఆరోపించారు.

కీలకంగా మారుతున్న రెబల్ ఎంపీ

కీలకంగా మారుతున్న రెబల్ ఎంపీ

వచ్చే ఎన్నికల్లో రఘురామ టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీగా ఉంటూ..ప్రభుత్వ లోపాలను ఎండగడుతున్న రఘురామకు ప్రతిపక్ష నేతల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏపీలో వైసీపీ..టీడీపీ.. జనసేనకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న వేళ.. రఘురామ పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా రఘురామ షష్ఠి పూర్తి వేడుకలు.. రాజకీయంగా అన్ని పార్టీల నేతల హాజరు పొలిటికల్ డిస్కషన్ కు కారణంగా మారుతోంది.

English summary
Many parties leaders attend celebrations in YSRCP Rebel MP Raghu Rama Raju house in Delhi, TRS MP;s also participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X