సీఎం జగన్ కు రఘురామ ఛాలెంజ్ - చేయలేకుంటే దమ్ములేని సీఎంగా : ప్రధాని- షా ఎవరికైనా..!!

వైసీపీ రెబల్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్ కు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే తాను రాజీనామా చేస్తానని.. తన మీద అనర్హత వేటు వేయించటానికి వైసీపీ నేతలకు ఎంత సమయం కావాలో చెప్పాలంటూ రఘురామ వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేసిన తరువాత తిరిగి అమరావి నినాదంతోనే పోటీ చేసి..ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తెలిసేలా చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక, రాజీనామా చేయాలని నిర్ణయించిన రఘురామ ఇప్పుడు తాజాగా మరో సవాల్ చేస్తున్నారు.

ఆ తేదీలోగా అనర్హత వేటు వేయించాలి

ఆ తేదీలోగా అనర్హత వేటు వేయించాలి


తనను ఎంపీగా వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీ లోగా అనర్హత వేటు వేయించాలని ఛాలెంజ్ చేసారు. అలా చేయలేకపోతే దమ్ములేని సీఎంగా అంగీకరించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పైన ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా..స్పీకర్ ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. ఢిల్లీ కేంద్రం నిత్యం సీఎం జగన్ .. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ప్రస్తావిస్తూ రఘురామ చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు స్పందించటం లేదు. తొలుత స్పందించినా... సీఐడీ అరెస్టు.. సుప్రీం బెయిల్ తరువాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. రఘురామ వైసీపీకి దూరమయ్యనే నిర్దారణకు వచ్చిన వైసీపీ నేతలు ఆయన పైన అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను కలిసి ఫిర్యాదులు చేసారు.

వైసీపీ నేతల ఫిర్యాదులు..ఆధారాలు

వైసీపీ నేతల ఫిర్యాదులు..ఆధారాలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి.. లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. విప్ మార్గాని భరత్ పలు మార్లు స్పీకర్ ను కలిసారు. అనర్హత వేటు వేయాలంటూ తమ ఫిర్యాదుకు మద్దతుగా ఆధారాలు అందించారు. అయితే, స్పీకర్ కార్యాలయం నుంచి రఘురామ కు నోటీసులు వెళ్లాయి. ఆ తరువాత ఆయన పైన చర్యల ప్రస్తావన లేదు. తాజాగా అమరావతికి మద్దతుగా తిరుపతిలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించటానికి మద్దతు ప్రకటించారు. అదే వేదిక పైన చంద్రబాబును ఆలింగనం చేసుకోవటం ద్వారా తన భవిష్యత్ రాజకీయ లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు.

Recommended Video

    AP Ticket Rates: Tollywood వైఖరి ఉక్కిరిబిక్కిరి | Nagarjuna |CM Jagan | Oneindia Telugu
    రాజీనామాకు సిద్దమంటూనే

    రాజీనామాకు సిద్దమంటూనే

    ఇక, గత వారం ఢిల్లీ వెళ్లిన మఖ్యమంత్రి ప్రధానితో సమావేశమైన సమయంలోనూ తన అంశం ప్రస్తావించారంటూ రఘురామ చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఏం చేసినా.. తన పైన అనర్హత వేటు పడదంటూ తొలి నుంచి రఘురామ ధీమాగా ఉన్నారు. ఇక, ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసి సీఎంకు డెడ్ లైన్ విధిస్తూ.. అనర్హత వేటు వేయించాలని సవాల్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. మరి..రఘురామ తాజా సవాల్ పైన వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారా లేదా .. వచ్చేనెల 5 లోగా రఘురామ పైన అనర్హత వేటు పడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+