తిరుమల శ్రీవారి హుండీకి రికార్డుస్థాయిలో ఆదాయం...
తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 2022 మార్చి నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోందని ఈ సందర్భంగా టీటీడీ పేర్కొంది. 29 నెలలు వరుసగా ఊ. 100 కోట్ల మార్క్‌ను అందుకుంటోంది. ఇక, జులై నెలకు గాను శ్రీవారి హుండీ ఆదాయం రూ.125 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సన్నిధికి నిత్యం భక్తులు రాకపోకలు సాగుతుంటాయి. ఒక్క ఏపీ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ మొక్కులను కానుకల రూపంలో చెల్లించుకోవడం ఆనవాయితీ.
శ్రీవారి హుండీకి రికార్డు స్ఠాయిలో ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. 2020 లో కరోనా మహామ్మారి కారణంగా ఆలయాన్ని మూసివేసారు. ఆ తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు తెరిచారు. 2022 మార్చి నుంచి తిరుమల స్వామివారి హుండీ ఆదాయం రూ.100 మార్క్‌ను అందుకుంటూనే ఉందని, ఎక్కువశాతం రూ.120 కోట్లను కూడా రాబట్టిందని అధికారులు చెబుతున్నారు. ఇక, జులై నెలకు గాను రికార్డు స్థాయిలో రూ. 125 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, రేపు (శుక్రవారం) డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. టీటీడీ ఈవో జే శ్యామలరావు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

ఆలయంలో పవిత్రోత్సవాలు..
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. సంవత్సరం పొడవునా ఆలయంలో ఎన్నో ఉత్సవాలు, అర్చనలు జరుగుతుంటాయి. తెలియక ఈ కార్యక్రమాల్లో కొన్ని దోషాలు జరుగి ఉండవచ్చు. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఉండేందుకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి విగ్రహాలను విమాన ప్రదక్షిణగా యాగశాలకు చేర్చారు. ఇక, అక్కడ స్నపనతిరుమంజనం ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో లు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి విగ్రహాలకు అభిషేకార్చనలు చేశారు.












Click it and Unblock the Notifications