ఎర్రచందనం స్మగ్లర్+ వైసీపీ నాయకుడు, పోలీసుల అదుపులో గంగిరెడ్డి,సెటిల్
ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నాయకుడుర్ కొల్లం గంగిరెడ్డిని రాయలసీమలోని అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని లక్ష్మీ థియేటర్ కు సంబంధించిన గొడవలో గంగిరెడ్డి అనుచరులు తల దూర్చడంతో ఆయన్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం.
కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా పేరు పొందారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొల్లం గంగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొల్లం గంగిరెడ్డి విడుదల చేసింది. జైలు నుంచి విడుదల అయిన తర్వాత గంగిరెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుండి గంగిరెడ్డి వైసీపీ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత గంగిరెడ్డి భూములు, గొడవల సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

రైల్వే కోడూరు కు చెందిన గంగిరెడ్డిపైన అనేక ఆరోపణలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. రైల్వేకోడూరులోని లక్ష్మీ థియేటర్ దగ్గర ఆదివారం సాయంత్రం పెద్ద గొడవ జరిగింది. లక్ష్మీ థియేటర్ స్థలం వివాదంలో గంగిరెడ్డి అనుచరులు జోక్యం చేసుకున్నారని ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసలు విచారణ చేసిన తరువాత వైసీపీ నాయకుడు గంగిరెడ్డి నుండి వివరాలు తెలుసుకున్న పోలీసులు తర్వాత ఆయన్ను వదిలేశారు. మదనపల్లెలో ఉన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కి గంగిరెడ్డిని విచారణ చేసి వదిలేశారనే విషయం తెలిసింది. వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని ఎందుకు వదిలేశారు అంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ రైల్వేకోడూరు పోలీసులను నిలదీశారని సమాచారం.
వెంటనే గంగిరెడ్డిని తన దగ్గరకు తీసుకురావాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ రైల్వేకోడూరు పోలీసులకు సూచించారు. వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి పై గతంలో కేసులు నమోదైనాయనే వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలుసుకుంటున్నారు, అందుకే గంగిరెడ్డిని మళ్లీ అదుపులోకి తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.












Click it and Unblock the Notifications