• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి ఎంట్రీ ఇలా:భక్తుల్లా తిరుమల కొండ పైకి...అటు నుంచి అటే!

|

తిరుపతి:ఒకవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు రెడ్ శాండర్స్ అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు రెడ్ శాండర్స్ స్మగ్లర్లు ఎటువైపు నుంచి అడవిలో ప్రవేశిస్తున్నారనేది కనుగొనడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న మార్గాలన్నింటినీ పోలీసు పహారా పరిధిలోకి తెచ్చినప్పటికీ వారు అడవిలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో తిరుమల భక్తుల్లాగా నటిస్తూ ఎర్రచందనం స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో అడవిలోకి ప్రవేశిస్తున్నారనడానికి పోలీసులకి స్పష్టమైన ఆధారం లభించింది. వివరాల్లోకి వెళితే...

 Red Sanders smugglers entering the forest in the form of Tirumala devotees

ఆదివారం ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవిలో కూంబింగ్ జరుపుతున్నటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనూహ్యంగా ఒక స్మగ్లర్ల ముఠాని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒకరు మినహా మిగిలిన స్మగ్లర్లు అందరూ పారిపోయారు. ఆ పట్టుబడిన స్మగ్లర్‌ ను విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి.

దాడుల గురించి ఆర్‌ఎస్‌ఐ విజయ నరసింహులు చెప్పిన వివరాల ప్రకారం...ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి కరకంబాడి నుంచి కూంబింగ్‌ సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు.

ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అడవిలోకి వెళుతున్న స్మగ్లర్లను టాస్కఫోర్స్ సిబ్బంది గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పలువురు పారిపోగా, తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లా కావండనూర్‌కు చెందిన ఏలుమలై దొరికిపోయాడు. అతడి నుంచి వివిధ వేషధారణల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల ఫొటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తాము ఎర్రచందనం దుంగలు నరికేందుకు అడవిలోకి ఎలా ప్రవేశిస్తున్నామో తమిళనాడు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు వివరించాడు.

స్మగ్లర్లు ఇచ్చే అత్యధిక కూలీ కోసం తమిళనాడుకు చెందిన పేద కూలీలు పలువురు శ్రీవారి భక్తుల రూపంలో బస్సుల్లో ముందుగా అలిపిరి చేరుకుంటామని... అక్కడ నుంచి కాలినడకన తిరుమల ప్రయాణమవుతామని తెలిపాడు. అలా ఎక్కువమంది వస్తే చూసేవాళ్లకి అనుమానం వస్తుందని ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున తనిఖీలు దాటుకుంటూ తిరుమల కొండపైకి గాలిగోపురం వరకు వెళతామని...ఇక ఆ ఆ తరువాత అటునుంచి అటే అడవిలోకి ప్రవేశిస్తామని అతడు వివరించాడు.

తాము మొత్తం 14 మంది బయలుదేరి ఇలా వచ్చామని...ఆల్రెడీ ఎర్రచందనం దుంగల లోడింగ్‌ చేసేశామని ఈ వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిపాడు. తాము అడవిలో దాచిన దుంగలను చూపిస్తానని సుమారు మూడు గంటలు పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అడవిలో తిప్పిన ఇతడు కేవలం తమను తప్పుదోవ పట్టించేందుకే అలా చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirumala:Andhra Pradesh task force police arrested one red sanders smuggler who have entered in forest in the form of Lord Venkateswar devotee in Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more