ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ
రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ కు మహర్దశ పట్టింది. అత్యాధునికంగా తుది రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఎయిర్ పోర్టుల తరహాలో ఓ కాంప్రహెన్సివ్ ట్రావెల్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు మరో రైల్వే స్టేషన్ అదే తరహాలో రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు. ఈ స్టేషన్ పునర్నిర్మాణం, పునరావృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ ఇప్పటికే రెడీ అయ్యాయి కూడా. ప్లాట్‌ఫామ్ సర్ఫేసింగ్, ఎక్స్ టెన్షన్ , దివ్యాంగుల సౌకర్యాలు, ఫెకేడ్ పనులు పూర్తయ్యాయి. విశాలమైన ల్యాండ్ స్కేప్, పార్కింగ్ ఏరియాలు సిద్ధం అయ్యాయి.

గతంలో ఉన్నప్పటి కంటే కూడా ప్లాట్‌ఫారాలను పొడిగించారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక వెయిటింగ్ హాల్ , దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ బిల్డింగ్ సముదాయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
ప్రయాణికులకు ఆధునిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఆదోని, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప,ధర్మవరం, గుడివాడ, గుత్తి, గుంటూరు, హిందూపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, రేణిగుంట, రాయనపాడు, మంగళగిరి వంటివి ఉన్నాయి.
నిడదవోలు స్టేషన్ కూడా ఇందులో భాగమే. రైల్వే స్టేషన్ ఆధునీకరించిన వసతులతో సరికొత్తగా అందుబాటులోకి రానుంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా- విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుంటాయి. ప్రయాణికుల తాకిడి అధికం. దీనికి ప్రత్యామ్నాయంగా నిడదవోలు స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications