333మంది స్మగ్లర్లు అరెస్ట్: 449 ఎర్రచందనం దుంగలు స్వాధీనం(పిక్చర్స్)

చిత్తూరు: ఆరేపల్లి రంగంపేట సమీపంలోని తులసిపెంట్ల అడవిలో మంగళవారం రాత్రి అటవీశాఖ, 11వ బెటాలియన్ దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తరలించడానికి సిద్ధం చేసిన 22 ఎర్రచందనం దుంగలతో ఇద్దరు ఎర్రదొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి అందిన సమాచారంతో ఎఫ్ఆర్వో రఘునాథ్, ఎఫ్‌బిఓలు కోదండం, రెడ్డప్ప, బేస్ క్యాంప్ సిబ్బందితోపాటు 11వ బెటాలియన్ సాయుధ బలగాలు రంగంపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు ఉత్తరదిశలోని అడవిలో అన్వేషణ చేపట్టారు.

అడవిలోని తులసిపెంట్ల ఎర్రదొంగలు 22 ఎర్రచందనం దుంగల వద్ద ఉండగా అటవీఅధికారులు చుట్టుముట్టారు. దీంతో వారు పారిపాయేందుకు విఫలయత్నం చేశారు. ఎర్రదొంగలు, 22 ఎర్రచందనం దుంగలను రంగంపేటలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

ఇది ఇలా ఉండగా నవంబర్ నెలలో జరిపిన దాడుల్లో 333 ఎర్రచందనం కూలీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇందులో 14 మంది స్టేజ్1, స్టేజ్2, స్మర్లర్లు, 19మంది పైలెట్, డ్రైవర్స్, 300 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. 449 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 36 వాహనాలను పట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో 9 బైకులు, 23 నాలుగు చక్రాల వాహనాలు, 4 ఆరు చక్రాల వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

స్మగ్లర్ల అరెస్ట్

స్మగ్లర్ల అరెస్ట్

నవంబర్ నెలలో జరిపిన దాడుల్లో 333 ఎర్రచందనం కూలీలను స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లర్ల అరెస్ట్

స్మగ్లర్ల అరెస్ట్

ఇందులో ఇందులో 14 మంది స్టేజ్1, స్టేజ్2, స్మర్లర్లు, 19మంది పైలెట్, డ్రైవర్స్, 300 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

స్మగ్లర్ల అరెస్ట్

స్మగ్లర్ల అరెస్ట్

449 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 36 వాహనాలను పట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

స్మగ్లర్ల అరెస్ట్

స్మగ్లర్ల అరెస్ట్

ఇందులో 9 బైకులు, 23 నాలుగు చక్రాల వాహనాలు, 4 ఆరు చక్రాల వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+