విజయసాయిరెడ్డి బిగ్ యూ టర్న్..! రీఎంట్రీకి సై- జగన్ కు కండిషన్స్..!
ఏపీలో గతేడాది వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీకి, ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ఒకప్పటి కీలక నేత విజయసాయిరెడ్డి (vijayasai reddy) పెద్ద షాక్ ఇచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ లో మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల నుంచి తాను తప్పుకోనని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ నెల 25తో తనకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుందని, తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ కూడా తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 25 ఏళ్లు ఉంటానని అనుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు-లోకేష్ కూడా 30 ఏళ్లు ఉంటామని అనుకుంటున్నారని, కానీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కూటమి అలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. అయితే కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే జగన్ (ys jagan) మళ్లీ అధికారంలోకి రారని తేల్చిచెప్పేశారు. కూటమిని విడగొడితేనే జగన్‌కు మళ్లీ అధికారం అన్నారు. తాను జగన్‌ను విమర్శించలేదని, ఆయనే నన్ను విమర్శించారని తెలిపారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని,ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు.

వైసీపీలో నంబర్ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపినట్లు సాయిరెడ్జి వెల్లడించారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 అనేది ఉండదని చెప్పానన్నారు. కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను 'నంబర్2'గా ప్రచారం చేశారన్నారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారని, మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదన్నారు. లిక్కర్ స్కాం గురించి తనకు తెలియదని, లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పానన్నారు.

సాయిరెడ్డి వందల కోట్లు దోచేశారంటూ వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారానికి స్పందించి తన ఆస్తుల వివరాలు ఇచ్చానని సాయిరెడ్డి తెలిపారు. తన అల్లుడి సంస్థ అరబిందో ఆస్తులకూ తనకూ సంబంధం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన నీచమైన పని విశాఖలో తన ఆస్తులపై విచారణకు సిట్ ను పంపడం అన్నారు. ఆస్తులు కొంటే ఆ డబ్పులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది విచారణ చేయించుకోవాలని కోరానన్నారు. చంద్రబాబు చేసిన ఈ దుష్టపని తాను మర్చిపోలేనన్నారు. కూటమి ప్రభుత్వం తనను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతోందన్నారు. విశాఖలో తనకు ప్లాట్ తప్ప ఏ ఆస్తీ లేదన్నారు. తన కోరికంతా రాజకీయాల్లోకి తిరిగా రావాలన్నదే అన్నారు. తిరిగి ప్రజాసేవలోకి వచ్చి తనపై దుష్ప్రచారం చేసిన వారికి బుద్ధి చెప్పడమే అన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications