Margadarsi Chits: మార్గదర్శికి రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ నోటీసులు-ఫోరెన్సిక్ ఆడిట్- ఐజీ ప్రకటన
ఏపీలో చిట్ ఫండ్స్ సంస్ధల అక్రమాలపై వైసీపీ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శితో పాటు దాదాపు
16 చిట్ ఫండ్ సంస్ధల కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఇందులో అధికారులకు సహకరించని సంస్ధలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
త్వరలో ఏపీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ తనిఖీల్లో సహకరించని మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధకు షోకాజ్ నోటీసు జారీ చేస్తారని, అలాగే మార్గదర్శి చిట్‌ల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ రామకృష్ణ ప్రకటించారు. చిట్‌ఫండ్ కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో సోదాలు నిర్వహించగా మార్గదర్శి సిబ్బంది తమకు సహకరించలేదని ఐజీ రామకృష్ణ తెలిపారు. దీంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రాధమిక దర్యాప్తులో డిపార్ట్‌మెంట్ సెక్యూరిటీ పేరుతో డిపాజిట్‌లను స్వీకరించడం, వడ్డీ చెల్లింపు ఆఫర్ చేయడం, ఆంధప్రదేశ్ లో కార్యకలాపాల కోసం ప్రత్యేక బ్యాలెన్స్ షీట్ నిర్వహించకపోవడం, వంటి ప్రధాన ఉల్లంఘనలను మార్గదర్శిపై జరిపిన దాడుల్లో కనుగొన్నట్లు ఐజీ రామకృష్ణ తెలిపారు. ఇతర కంపెనీల్లో చిట్‌ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము మళ్లించిచినట్లు ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజాధనాన్ని కాపాడే ఉద్దేశంతో, ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు ఆంధ్రాలోని దాదాపు 35 చిట్‌ఫండ్ కంపెనీలను 3 దశల్లో దాడులు చేసినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications